కరోనాకే షాకిచ్చిన 105 ఏళ్ల బామ్మ..!
హైదరాబాద్ లోని పాతబస్తీ పెద్దపడఖానా వీధికి చెందిన బి.మోహనమ్మకు 105 ఏళ్ల వృద్ధురాలు. భర్త బంగారం నగల తయారీ చేసేవారు. భర్త మరణించడంతో అన్ని బాధ్యతలు తనే చూసుకునేది. నగరంలో కేసులు ఎక్కువగా నమోదు కావడంతో స్వగ్రామమైన కర్నూల్ కి వెళ్లిపోయారు. వీరి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. కరోనా వ్యాప్తి కారణంగా గ్రామంలో వాలంటీర్లు 60 ఏళ్ల పైబడిన వారికి కరోనా చికిత్సలు చేస్తున్నారు. మోహనమ్మకు పరీక్షలు నిర్వహించడంతో గత నెల 19 వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు వెల్లడించారు. దీంతో బామ్మను కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలో చేరినప్పుడు ఆమెకు జ్వరం తప్ప వేరే సమస్యలు తలెత్తలేదు. మధ్యలో ఆయాసం వస్తే ఆక్సిజన్ అందించారంతే. కరోనా సోకినా ధైర్యంతో ఎదుర్కొన్నారు. రోజూ యోగా, ధ్యానం, వాకింగ్, పౌష్టికాహారం తీసుకున్నారు. తల్లితో పాటే కొడుకు దగ్గరుండి డిశ్చార్జ్ అయ్యేవరకు చూసుకున్నాడు. బామ్మ కరోనాతో పోరాడి గతనెల 31 న డిశ్చార్జ్ అయ్యారు. వయసు పైబడిన వారిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందని కలత చెందే వారికి ఆదర్శంగా నిలిచింది. ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని తెలిపారు.