జగన్ రాజధానిని విశాఖకు తరలించడంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలివే....?
హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది. అయితే జగన్ రాజధానిని విశాఖకు తరలించడంలో పలు సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ప్రకటించడంతో సమస్యలన్నీ తొలగిపోతే విశాఖ కేంద్రంగానే పరిపాలన సాగుతుంది. హైకోర్టును కర్నూలుకు తరలించడంలో కేంద్రం ఆమోదం, సుప్రీం కోర్టు అనుమతి అవసరం ఉన్నట్లే విశాఖకు కార్యాలయాలు తరలించడం అంత సులభం కాదు.
అయితే కోర్టులోని పిటిషన్లు ఎప్పటికీ పరిష్కారమవుతాయో... కోర్టు కార్యాలయాలను విశాఖకు తరలించే విషయంలో ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. టీడీపీ ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాల ద్వారా మూడు రాజధానుల ప్రక్రియను ఆపడానికి ప్రయత్నిస్తోంది. వైజాగ్ లో పలు ప్రదేశాల్లో పాలనా అవసరాలకు తగిన విధంగా ఏర్పాట్లు జరగాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఏర్పాట్లు చేయడం అంత సులభం కాదు.
అమరావతి నుంచి విశాఖకు హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా తరలించడానికి ఏడాది సమయం పడుతుంది. అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపు చాలా కష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో జగన్ పూర్తిస్థాయిలో సక్సెస్ అవుతారో ఫెయిల్యూర్ అవుతారో చూడాల్సి ఉంది. ఇప్పటికే పలుమార్పు జగన్ సర్కార్ కు హైకోర్టులో వ్యతిరేక తీర్పులు వచ్చాయి. ఇలాంటి సమయంలో మూడు రాజధానుల తరలింపు విషయంలో హైకోర్టు తీర్పే కీలకం కానుంది.