వావ్ రూ.1,110 తో కొత్త స్కూటర్....!

Suma Kallamadi
రక్షా బంధన్ వచ్చేస్తోంది. అయితే మీరు మీ సోదరికి బంపర్ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారా...?  అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ గిఫ్ట్ మీరు కొనండి. తక్కువ ధరకే మీకు ఇది అందుబాటులో ఉంది. తాజాగా ఒక లీజ్ ప్రోగ్రాం అందుబాటు లోకి తీసుకు వచ్చింది. దీని వల్ల ప్రయోజనం ఏమిటంటే?  లీజ్ ప్రోగ్రాం లో భాగంగా కస్టమర్లకు తక్కువ ధరకే స్కూటర్ వస్తోంది. ఇలా తక్కువ ధరకే ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ ని ఇంటికి తీసుకెళ్లవచ్చు.

స్టాండర్డ్ ఈఎంఐ కన్నా తక్కువ ధరకే స్కూటర్ లభించడం విశేషం. అయితే ఈ లీజ్ లో  భాగంగా ఎలక్ట్రికల్ స్కూటర్ తీసుకోవాలి అని మీరు అనుకుంటే నెలకి కేవలం మీరు రూ. 1110 చెల్లిస్తే చాలు. ఈ ఆఫర్ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ అవకాశం బెంగళూరు లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఈ ఏడాది చివరి లోగా  ఈ ప్రోగ్రాంను హైదరాబాద్, పూణే, ఢిల్లీ, చెన్నై, కొచ్చిన్ వంటి ప్రాంతాల్లో కూడా తీసుకు వస్తామని కంపెనీ చెప్పింది.

ఆంపియర్ వీ 48 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.34,249. దీని ఈఎంఐ రూ.1610. ఒక వేళ కనుక మీరు ఈ స్కూటర్‌ను లీజ్ ప్రోగ్రామ్‌ లో  తీసుకుంటే....అప్పుడు నెలకు రూ.1,110 చెల్లిస్తే  చాలు. అలాగే జీల్ మోడల్‌‌‌‌పై ఈఎంఐ 3020. దీన్ని లీజ్ ప్రోగ్రామ్‌ లో కనుక మీరు తీసుకుంటే నెలకు రూ.2220 చెల్లించాలి. ఈ స్కూటర్ ని  ఒక్క సారి చార్జ్ చేస్తే అది 75 కిలో మీటర్లు వరకు వెళ్తుంది. ఓటీఓ క్యాపిటల్ వెబ్‌ సైట్‌కు వెళ్లి నచ్చిన ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. లీజ్ టెన్యూర్ ముగిసిన తర్వాత స్కూటర్‌ను ఓటీఓ సంస్థకు అప్పగించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: