కనికరం లేని కరోనా రక్కసి.. ఆ పసిప్రాణాన్ని పురిటిలోనే చిదిమేసింది..?
తాజాగా కరోనా వైరస్ ముక్కుపచ్చలారని చిన్నారిని బలితీసుకుంది. తల్లి గర్భం నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచి ఈ లోకాన్ని కూడా సరిగ్గా చూడని చిన్నారిని చిదిమేసింది కరోనా. కేవలం శిశువుని మాత్రమే కాదు ప్రసవించిన తల్లిని కూడా కరోనా పొట్టనబెట్టుకున్న ఘటన ప్రస్తుతం ఎంతో మందిని కలిచివేస్తుంది.ఈ హృదయ విదారక ఘటన... సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గర్భంతో ఉన్న మహిళ ఇటీవలే ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా... పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ తల్లి కరోనా వైరస్ తన చిన్నారి బిడ్డను చిదిమేస్తుంది అని ఊహించలేకపోయింది.
చివరికి తన ప్రాణాలు తీయడమే కాదు... పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ప్రాణాలు కూడా తీసేసింది కనికరం లేని కరోనా రక్కసి . సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామం లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గాజులపల్లి గ్రామానికి చెందిన ఓ గర్భిణీ మహిళ ప్రసవం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఇక ప్రభుత్వాసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది సదరు మహిళ. ఈ క్రమంలోనే వైద్యులు సదరు బాలింతకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసారు. ఈ పరీక్షల్లో సదరు మహిళకు పాజిటివ్ అని వచ్చింది. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించి సదరు మహిళ కన్నుమూసింది. ఆ తర్వాత అనారోగ్యంతో బాధపడుతూ శిశువు మృతి చెందింది. ఈ విషాద ఘటన ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.Powered by Froala Editor