బ్రతికుండగానే అధికారులు ఆ వృద్ధురాలిని చంపేశారు.. చివరికి..?

praveen
కొన్ని కొన్ని సార్లు అధికారులు చేసే చిన్న చిన్న నిర్లక్ష్యమే... కొంతమంది పాలిట పెద్ద పెద్ద శాపాలుగా మారిపోతూ ఉంటుంది . ఇక్కడ ఇలాంటిదే జరిగింది.. ఆమె ఒక వృద్ధురాలు... ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్  మీద ఆధారపడి జీవనం సాగిస్తోంది... ఎలాంటి పని చేసుకోలేని  నిస్సహాయ స్థితిలో ఉంది ఆ వృద్ధురాలు... ఇక పింఛన్ ఇచ్చిన ముఖ్యమంత్రి దేవుడు అనుకుంటూ... ఆ పింఛన్ తోనే  సర్దుకుని జీవనం సాగిస్తోంది. కానీ... కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉన్నా... ఆ తర్వాత అధికారులు ఆ వృద్ధురాలు ని చంపేశారు. ప్రభుత్వ సామాజిక పింఛను ఆ వృద్ధురాలికి నిలిపివేశారు. దీంతో రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం నుంచి వస్తున్న పింఛన్  పైనే జీవనం  సాగిస్తున్న ఆ వృద్ధురాలు దీనస్థితిలో కి వెళ్ళిపోయింది.

ఎన్నో బ్బందులు పడుతుంది. అధికారులు ఆ వృద్ధురాలు బతికుండగానే రికార్డుల్లో  చనిపోయినట్లుగా నిర్ధారించి ఆ వృద్ధురాకి పింఛన్   నిలిపివేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు నెలల నుంచి వృద్ధురాలికి పింఛన్ అందడం లేదు. ఏంటి అని అడిగితే పింఛన్ దారుల్లో  మీ పేరు లేదు అంటూ సమాధానం చెబుతున్నారు అంటూ ఆ వృద్ధురాలు వాపోయింది. వేణుతురుమిల్లి  ఎస్సీ వాడికి  చెందిన పాగోలు  భాగ్యమ్మ  రెండు దశాబ్దాలుగా ఫించన్ పైనే జీవనం సాగిస్తుంది. ఎలాంటి పని చేసుకోలేని  నిస్సహాయ స్థితిలో ఉండటంతో కేవలం పింఛన్ తోనే జీవితం సాగిస్తోంది. ఇక కొన్ని నెలల క్రితం కొడుకు ను చూసేందుకు గ్రామంతరం  వెళ్లి అక్కడే లాక్ డౌన్ కారణంగా  ఉండి పోయింది సదరు వృద్ధురాలు.

రెండు నెలలపాటు పింఛన్ తీసుకోలేకపోయింది ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చి పింఛన్  కోసం వెళ్తే .. ఏకంగా ముఖం మీదే చనిపోయావంటూ  అధికారులు చెప్పారు.  పింఛన్ ఇచ్చేందుకు నిరాకరించారు. రికార్డుల్లో కూడా ఆ వృద్ధురాలు చనిపోయినట్లుగా నమోదు చేశారు అధికారులు, మామూలుగా నిబంధనల ప్రకారం మూడు నెలల పాటు పెన్షన్ తీసుకోకపోతే అది రద్దు  అవుతుంది, ఎక్కడో పొరపాటు జరిగిందని గ్రామ వాలెంటర్ల్లు వివరణ ఇస్తున్నారు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: