కస్టమర్లకు శుభవార్త చెప్పిన ఫ్లిప్ కార్ట్.. ఇక 90 నిమిషాల్లో డెలివరీ..!?
ప్రస్తుతం అంతా ఆన్లైన్ ప్రపంచం నడుస్తున్న విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి ఆర్డర్ చేయడమే... షాప్ కి వెళ్లాల్సిన పనిలేదు శ్రమించాల్సిన అవసరం లేదు... హాయిగా ఇంట్లో కూర్చుని డోర్ డెలివరీ పొందేందుకు అవకాశం ఉంది. ఇక ఇలా కస్టమర్లకు ఎప్పటికప్పుడు మెరుగైన సేవలను అందించేందుకు ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఎప్పటికప్పుడు సిద్ధమవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్ని ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు ఉన్నప్పటికీ ఫ్లిప్కార్ట్ పై నెటిజన్లకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అందుకే ఏది కావాలన్నా ఫ్లిప్కార్ట్ నుంచి సులభంగా ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే తాజాగా ఫ్లిప్కార్ట్ కస్టమర్స్ అందరికీ గుడ్ న్యూస్ వినిపించింది. కష్టమర్లందరికీ ఇక నుండి ఫాస్టెస్ట్ డెలివరీ అందించేందుకు సిద్ధమైంది ఫ్లిప్కార్ట్. ఎంత త్వరితగతిన అంటే మీరు ఊహించని విధంగా కేవలం గంటన్నర సమయంలో మాత్రమే.
గ్రోసరీ, హోమ్ యాక్సాసిరీస్ కొనుగోలు చేస్తే కేవలం గంటన్నర సమయం లోనే ఫ్లిప్కార్ట్ కస్టమర్ లకు డెలివరీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఇతర ఆన్లైన్ సంస్థల నుంచి ఉన్న పోటీని తట్టుకునేందుకు ఫ్లిప్కార్ట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఫ్లిప్ కార్ట్ క్విక్ పేరుతో ఈ లోకల్ సర్వీసులను ప్రారంభించింది. అయితే ప్రస్తుతం కేవలం గ్రాసరీస్ కి మాత్రమే ఫాస్ట్ డెలివరీ చేసేందుకు సిద్ధమైన ఫ్లిప్కార్ట్ రానున్న రోజుల్లో మొబైల్ ఫోన్ లను కూడా త్వరితగతిన డెలివరీ చేసినందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఫ్లిప్కార్ట్ నుంచి క్విక్ సర్వీసులు అందుబాటులో కి రాగా...కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కస్టమర్లు వీటిని ఉపయోగించుకుంటున్నారు. బెంగళూరు లోని కొన్ని లొకేషన్లలో మాత్రమే ఫ్లిప్కార్ట్ క్విక్ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఐడియా అక్కడ సక్సెస్ అయితే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ఫాస్ట్ డెలివరీ సేవలను కస్టమర్లకు అందుబాటులో ఉంచేందుకు ఫ్లిప్కార్ట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే అమెజాన్ బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు ఫాస్ట్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే. వీటి పోటీని తట్టుకునేందుకు మరింత సృజనాత్మకంగా ఆలోచించి ఫ్లిప్కార్ట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.