ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. ఛీ ఛీ ఈ నీచున్ని ఉరి తీయాల్సిందే..?

praveen
ఏంటి సమాజం... సమాజంలో  బతుకుతుంది మనుషులా  మనుషుల రూపంలో ఉన్న కామందులా... రోజురోజుకు సమాజం తీరు ఎటు పోతుంది...  ఆడ పిల్లల జీవితం కామాంధుల బారిలో పడి బలవ్వడమేనా... అసలు ఆడపిల్లలకు రక్షణ లేదా... సృష్టికి మూలమైన ఒక మహిళ ప్రస్తుతం ప్రశ్నార్థక జీవితాన్నే ఎదుర్కొంటుందా..  తాజా పరిస్థితులను చూస్తుంటే.. ఆడపిల్లలకు రక్షణ ఉంది అనే సమాధానం మన నోటి నుండి రాదు. ఎందుకంటే ప్రతి రోజు ప్రతి గంట ఎక్కడో ఓ చోట... కామందుల కోరల్లో చిక్కుకొని మహిళలు చిన్నారులు వృద్ధులు బలి అవుతూనే ఉన్నారు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మహిళల  జీవితానికి మాత్రం అవి భరోసా ఇవ్వలేకపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కామందుల బారిన  పడి వారి బతుకులు చిద్రమై పోతున్నాయి. ఢిల్లీలో నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష వేసి చంపేసిన ఎవరి లో మార్పు రావడంలేదు.

తాజాగా నిర్భయా ఘటనను  తలపించే మరో ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. కరీం ఏరియాలో ఓ మరాఠి ఫ్యామిలీ నివసిస్తోంది. అదే ప్రాంతంలో సుధామ అనే వ్యక్తి తన కుటుంబం తో నివసిస్తున్నాడు. రిక్షా తోలుతు జీవనం సాగిస్తున్నాడు సుధామ . సుధామాకి లేని చెడు అలవాటు అంటూ  లేదు... రాత్రి అయ్యిందంటే మద్యం ఉండాల్సిందే . ఈ క్రమంలోనే ఇటీవల ఓ రోజు రాత్రి సమయంలో ఫుల్లుగా మద్యం తాగి రోడ్డుపై తూలుతూ వెళుతున్నాడు. కరోనా దృశ్య  రోడ్డు మీద ఎవరూ కనిపించడం లేదు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్నా ఇంటి వరండాలో ఓ వృద్ధురాలు పక్కనే ఎనిమిదేళ్ల చిన్నారి నిద్రిస్తున్నట్లు గా కనిపించింది.

ఆ చిన్నారి పై కన్నేసిన సుధామ కామం తో ఊగిపోయాడు. చిన్నారి నోరుని అదిమి పట్టుకుని తన ఇంట్లోకి లాక్కెళ్లాడు. ఇక తన ఇంట్లో అందరూ పొరుగూరు వెళ్లడంతో రాత్రంతా చిత్రహింసలకు గురిచేస్తూ ఆ చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పొద్దున్న లేచేసరికి  పక్కన మనవరాలు లేకపోవడంతో టెన్షన్ పడిన వృద్ధురాలు... ఇంట్లోని కుటుంబ సభ్యులను లేపింది. ఇక  వారందరూ వెతుకుతున్న సమయంలో కొంత దూరంలో ఆ చిన్నారి కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా తీవ్ర రక్తస్రావం అవుతోంది. హాస్పిటల్ కి తరలించగా చిన్నారరిని  పరీక్షించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ చిన్నారి ఏం జరిగిందో చెబుతున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది. ఇలాంటి నీచులకు  ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు..Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: