తల్లిదండ్రులు మంచి కోసం చేసిన పని... తమ కూతురు ప్రాణం తీసింది..?

praveen
ఈ మధ్యకాలంలో మనుషుల ప్రాణాలకు విలువ ఎక్కడది... చిన్న చిన్న విషయాలకే మనస్థాపం చెంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని బలవన్మరణానికి పాల్పడిన వారు కొందరైతే మనుషుల ప్రాణాలను లెక్కచేయకుండా ప్రాణాలు తీస్తున్న వారు ఇంకొందరు. వెరసి  రోజురోజు కి మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది, ఈ మధ్యకాలం లో పిల్లలు క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్న  ఘటనలు ఎన్నో తెర మీదికి వచ్చి విషాదాన్ని నింపుతున్నాయి. తల్లిదండ్రులు తిట్టారనో... టీచర్ మందలించిందనో.. ఇలా చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.



 బలవన్మరణాల కు పాల్పడుతున్నారు. చివరికి అభం శుభం తెలియని వయసులోనే ప్రాణాలను వదులుతూ.. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని నింపుతున్నారు. తాజాగా ఇక్కడ ఇలాంటి ఓ విషాదకర ఘటన జరిగింది. తల్లిదండ్రులు మందలించారని ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. సెల్ఫోన్ ఆమె ప్రాణం తీసింది... చివరికి ఆ తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులో కి వచ్చింది. తమ కూతురు ఊరికే మొబైల్ పట్టుకొని దానికి బానిసల మారిపోతుందని భావించిన తల్లిదండ్రులు తమ కూతురిని  మందలించారు.



 ఆ వ్యసనం నుంచి బయటకు రావాలని... కూతురు చేతి లోంచి ఫోన్ లాక్కున్నారు తల్లిదండ్రులు. కానీ ఈ ఘటనే వారికి కడుపు కోత మిగులుస్తుందని  ఊహించలేకపోయారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి... అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు విగతజీవి గా కనిపించింది. ఇంట్లో ఫ్యాన్ కు  ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: