ఏపీలో ఈ ప్లేస్ మోస్ట్ డేంజరస్... అక్కడ కరోనా వస్తే బతికే ఛాన్సే లేదా...!
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వం ముందు కఠిన చర్యలు తీసుకున్నా తర్వాత కాస్త ఉదాసీనంగా వ్యవహరించడంతో ప్రజలు రోడ్లమీదకు వచ్చేశారు. దీంతో కరోనా పూర్తిగా కంట్రోల్ తప్పేసింది. ఇక లేటెస్ట్ కరోనా బులిటెన్ చూస్తే రాష్ట్రంలో పెరుగుతున్న కరోన పాజిటివ్ కేసులతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గత 24 గంటల్లో 7813 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో 52 మంది మృతి చెందారు. ఒక్క రోజే ఏకంగా 8 వేల కేసులు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 88,671 గా ఉంది.
రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 985కు చేరుకుంది. 90 వేల కేసులు... వెయ్యి మరణాలు అంటే అనధికారిక లెక్కలను.. మిస్సింగ్ కరోనా బాధితులను కూడా కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువ కానుంది. గత పది రోజుల్లోనే ఇక్కడ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్రం అంతా ఎలా ఉన్నా మూడు జిల్లాల్లో మాత్రం కరోనా హైరిస్క్‌లో ఉందని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే మే వరకు కరోనా ఫ్రీ జిల్లాలుగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాల్లో కూడా ఇప్పుడు కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి.
ఇక ఏపీలో అత్యధిక రిస్క్ ఉన్న జిల్లాగా తూర్పు గోదావరి జిల్లా నిలుస్తోంది. రాష్ట్రంలోనే ఇక్కడ అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఇక్కడ ప్రతి ఆదివారం లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఇక్కడ కేసులే ఏకంగా 10 వేలు దాటేశాయి. ఇక్కడ మరణాల సంఖ్య మిగిలిన జిల్లాల కంటే చాలా ఎక్కువుగా ఉంది. కరోనా వచ్చిన వారిలో ఎక్కువ మంది ఈ జిల్లా నుంచే మృతి చెందుతుండడంతో ప్రభుత్వం సైతం తల పట్టుకుంటోన్న పరిస్థితి. ఇక తూర్పు తర్వాత కర్నూలు, నెల్లూరు, తిరుపతి లాంటి నగరాల్లో కరోనా స్వైరవిహారం ఎక్కువుగా ఉంది.