నలంద కిషోర్ మృతి... పోలీస్ హత్యే.... రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు...?

Reddy P Rajasekhar

వైయస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు టీడీపీ సానుభూతిపరుడు నలంద కిషోర్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఏపీలో కరోనా కంటే పెద్ద విషయాలు ఉన్నాయని.... దేశంలోనే రెండో స్థానంలో నిలబడేలా కరోనా కేసులు నమోదవుతున్నా ఇక్కడ ఇంకా సంచలనాలు ఉన్నాయంటే ఇక్కడి రాజకీయం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఆరోగ్యం బాగాలేకపోయినా కిషోర్‌ను కర్నూలుకు తీసుకెళ్లారని... కిషోర్‌ను తరలించిన సమయంలో కర్నూలులో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. 
 
సోషల్ మీడియాలో పోస్టు చేసిన పాపానికి ఏపీ ప్రభుత్వం తీరు ఒక మనిషిని చంపేసిందని ఘాటు విమర్శలు చేశారు. కర్నూలులో కరోనా పాజిటివ్ పేషంట్లను పెట్టే సెంటర్‍లో కిషోర్‍ను పెట్టారని.... కిషోర్ కరోనాతో చనిపోయి ఉండవచ్చని... అందువల్ల ఈ హత్యను పోలీస్ హత్యగానే భావించాలని అన్నారు. కిషోర్ పెట్టిన పోస్టుల్లో ఎవరి పేరు లేకపోయినా అరెస్ట్ చేశారని... ప్రభుత్వం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తోందని అన్నారు.       
 
మాట్లాడే హక్కే కాకుండా జీవించే హక్కును కూడా హరిస్తున్నారా...? అని ప్రశ్నించారు. మన ప్రభుత్వంలో ఇలాంటి వేధింపులు ఎందుకు? అని కామెంట్లు చేశారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను తెలుసుకోవాలని.... సంక్షేమ పథకాలతోనే మనం ఎల్లకాలం మనుగడ సాధించలేమని అన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని సూచనలు చేశారు. కుటుంబాల శాపాలు ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పారు. 
 
నిన్న సుప్రీంలో జరిగింది సాక్షిలో కనిపించలేదని... నిమ్మగడ్డను కొనసాగించే ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో మంత్రి అవంతి, విజయసాయిరెడ్డిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడని కిషోర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కిషోర్ సన్నిహితుడు. వైద్యులు చేసిన పరీక్షల్లో కిషోర్ కు కరోనా నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: