కేటీఆర్ పుట్టినరోజు... బావ హరీష్ రావు ఏమని విష్ చేశారంటే....?

Reddy P Rajasekhar

నేడు తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజనే సంగతి తెలిసిందే. నేటితో కేటీఆర్ కు 44 సంవత్సరాలు పూర్తై 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఐతే కేటీఆర్ కు ఎంతమంది శుభాకాంక్షలు చెప్పినా బావ హరీష్ రావు చెప్పే విషెస్ ఎప్పుడూ ప్రత్యేకమే. కేటీఆర్, హరీష్ రావు అభిమానులు కూడా హరీష్ రావు శుభాకాంక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 

 


 
సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా హరీష్ రావు కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు. మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేటీఆర్ అభిమానులకు కీలక సూచనలు చేశారు. ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం డబ్బును వృథా చేయవద్దని... ఆపదలో ఉన్నవారి కోసం డబ్బులు ఖర్చు చేయాలని రారు. 

 


 


సోషల్ మీడియా వేదికగా జగదీష్ రెడ్డి, చిరంజీవి, కోన వెంకట్, బండ్ల గణేష్, ఇతర సినీ ప్రముఖులు కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా విజృంభణ నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు కేటీఆర్ సోదరి కవిత కారు డ్రైవర్ కు కరోనా నిర్ధారణ కావడంతో ఆమె కుటుంబసభ్యులతో హోం క్వారంటైన్ లో ఉన్నారు. అందువల్ల ఆమె పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారని తెలుస్తోంది. 

 


 
మరోవైపు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు మరో కీలక పదవి లభించింది. జీఎస్టీ వివాదాలకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన ఐజీఎస్టీ కమిటీలో మంత్రి హరీశ్‌రావుకు చోటు దక్కింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సెల్‌ సెక్రటరి ఎస్‌.మహేశ్‌ కుమార్‌ కొత్త కమిటీని ప్రకటించారు. బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. . ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై పని చేసేందుకు 2019 డిసెంబరులో జీఎస్టీ మండలి మంత్రుల బృందంతో ప్రత్యేక కమిటీని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: