ఆ దేశంలో కరోనా కేసులు జీరో.... వైరస్ ను ఎలా జయించిందంటే....?

Reddy P Rajasekhar

భారత్ లో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయం కొనసాగుతోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పట్లో వైరస్ ను కట్టడి చేయడం సాధ్యం కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా మరో దేశం కరోనాను జయించింది. 
 
అమెరికాకు పక్కనే ఉన్న క్యూబా దేశంలో వైరస్ జీరోకు చేరుకుంది. ఆ దేశం అవలంభించిన విధానాల వల్లే కేసుల సంఖ్య జీరోకు చేరినట్టు తెలుస్తోంది. ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే అగ్ర రాజ్యం అమెరికాలో అదిక సంఖ్యలో కేసులు నమోదవుతుంటే పక్కనే ఉన్న క్యూబాలో వైరస్ కట్టడి చేయడం సాధ్యం కావడానికి ఆ దేశం అవలంభించిన విధానాలే కారణమని తెలుస్తోంది. క్యూబా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వయంగా ఈ మేరకు ప్రకటన చేసింది. 
 
గతంలో న్యూజిలాండ్ కరోనా ఫ్రీ దేశంగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే ఆ దేశంలో కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా కరోనా ఫ్రీ దేశంగా ప్రకటించుకున్న క్యూబాలో ఎక్కువ మంది వైద్యులు ఉండటం వల్లే వైరస్ నియంత్రణ సాధ్యమైంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది వైద్యులు ఉన్న దేశంగా క్యూబాకు పేరుంది. 
 
క్యూబాలో కరోనా నిబంధనలు పాటించని వారిపై భారీ జరిమానాలు విధించారు. దీంతో అక్కడి ప్రజలు మాస్క్ లేకుండా బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. క్యూబా ప్రభుత్వం 130 రోజుల పాటు కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేసింది. ప్రజలు నూటికి నూరు శాతం సోషల్ డిస్టెన్స్ పాటించారు. ఇప్పటివరకూ క్యూబాలో 2,446 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య తక్కువగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: