కాపురాల్లో చిచ్చు పెడుతున్న కరోనా.... మహిళలపై పెరిగిన గృహ హింస....?

Reddy P Rajasekhar

భారత్ లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో నిన్న ఒక్కరోజే 45,720 కరోనా కేసులు నమోదయ్యాయి. కొన్ని రోజుల తర్వాత భారత్ లో అమెరికాను మించి కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
కరోనా వైరస్ చివరకు కాపురాల్లో చిచ్చు పెడుతోంది. చాలా సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న వాళ్లు సైతం కరోనా వల్ల విడిపోతున్నారు. సంసారం విషయంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరుగుతున్నాయి. కరోనా సమయంలో భార్యాభర్తలిద్దరూ ఇంట్లోనే ఉండటంతో వాళ్లిద్దరి మధ్య గొడవలు పెరుగుతున్నాయి. సమస్యలు జఠిలమై విడిపోతున్న భార్యాభర్తల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 
 
మరోవైపు గృహహింస కేసులు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లాక్ డౌన్ మొదలైన రోజు నుంచి ఇప్పటివరకు 515 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్నచిన్న సమస్యలే పెద్దవిగా మారి భార్యాభర్తలు విడిపోతున్నారు. కరోనా వైరస్ మహిళల స్వేచ్ఛను హరించడంతో పాటు వాళ్లపై ఒత్తిడిని పెంచుతోంది. మద్యం, ఉద్యోగ భద్రత, జీతాల్లో కోత, వ్యాపారాల్లో నష్టం, తదితర కారణాల వల్ల భర్తలు భార్యలపై కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. 
 
24 గంటలు భర్తలతో కలిసి ఉండటంతో గృహహింస కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. పని ఒత్తిడితో కొందరు.. వర్క్‌ ఫ్రం హోమ్‌ టెన్షన్‌తో కొందరు, తాగుడుకు బానిసై కొందరు ఇంట్లో ఉండే ఇల్లాలిపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. గృహహింస, లైంగిక హింసలను ఎదుర్కొనే మహిళలకు, బాలికలకు రక్షణ, న్యాయ తదితర సేవలను సఖీ కేంద్రం ద్వారా అందిస్తారనే సంగతి తెలిసిందే. సఖీ కేంద్రం ద్వారా 1,053 గృహహింస కేసులు నమోదయ్యాయని...... లాక్‌డౌన్‌ సమయంలో గృహహింస కేసులు ఎక్కువగా వచ్చాయని నిర్వాహకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: