కరోనా గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్...?
కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ప్రజలకు వణికిస్తున్న సమస్య ఇది. ఉపాధి పోగొట్టింది.. ఉత్సాహం పోగొట్టింది.. ఇప్పుడు ఏకంగా ప్రాణాలనే పోగొడుతోంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రోజూ వేల సంఖ్యలోనే కొత్త కేసులు వస్తున్నాయి. అందులోనూ కరోనా వస్తే ఇప్పటి వరకూ ప్రధానంగా గాంధీ ఆసుపత్రిలోనే ప్రధానంగా చికిత్స అందించేవారు.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్‌లో మరికొన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిస్థాయి కొవిడ్ చికిత్సా కేంద్రాలుగా మార్చాలని కేసీఆర్ నిర్ణయించారు. గాంధీకి తోడుగా ఫీవర్ ఆసుపత్రి, కింగ్ కోఠిలో పూర్తిగా కొవిడ్ బాధితులకు సేవలందించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం గాంధీలో 800 మందికి పైగా రోగులు ఉన్నారు. గాంధీ ఆసుపత్రిలో ఇంతకు మించి.. చేర్చుకునే అవకాశం లేదు. క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న సమయంలో ఆసుపత్రులు పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్‌తో మాట్లాడారు.
ఫీవర్ ఆసుపత్రిలో మొత్తం 340 పడకలు ఉన్నాయి. వాటిలో 190 బెడ్లు కరోనా రోగులకు వాడుతున్నారు. ఇక్కడ కరోనా రోగుల కోసం మరో 100 ఐసీయూ పడకలను తీర్చిదిద్దనున్నారు. అదే సమయంలో కింగ్‌కోఠి ఆసుపత్రిలో 350 పడకలు ఉంటే 200 పడకల్లో కరోనా రోగులకు అందిస్తున్నారు. ఇక్కడ మరో 200 పడకలను ఐసీయూ స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు.