ఆ శక్తిపై కన్నేసిన ఏపీ.. ముందింది మంచి కాలం..!?

frame ఆ శక్తిపై కన్నేసిన ఏపీ.. ముందింది మంచి కాలం..!?

Chakravarthi Kalyan

ఆధునిక యుగంలో అభివృద్ధి అంతా పవర్ మీదే ఆధారపడి  ఉంది. ఇక్కడ పవర్ అంటే అధికారం అని కాదండోయ్.. పవర్ అంటే.. శక్తి.. విద్యుత్ శక్తి.. తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఎక్కువ ఉంటే.. అంతగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో తన ట్రాక్ రికార్డు మరింత మెరుగుపరచుకునేందుకు ఏపీ ప్రయత్నిస్తోంది. 

 


తాజాగా ప్రకటించిన  పునరుద్పాదక ఇంధన ఎగుమతి పాలసీ ఇందుకు అద్దం పడుతోంది. పునరుత్పాదక  ప్రాజెక్టులను ప్రోత్సహించటం లక్ష్యంగా ఏపీ రెన్యువబుల్ ఎనర్జీ ఎక్స్ పోర్టు పాలసీ 2020ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సౌర, పవన, హైబ్రీడ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు లక్ష్యంగా కొత్త పునరుద్పాదక ఇంధన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో 120 గిగావాట్ల పునరుద్పాక ఇంధన ప్రాజెక్టుల స్థాపన లక్ష్యంగా కొత్త విధానాన్ని  రూపొందించింది. 

 

 


ఈ పాలసీలో..  మొత్తం  5లక్షల ఎకరాల భూమిని సౌర, పవన, హైబ్రీడ్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం వినియోగించాలని  టార్గెట్ గా ఏపీ పెట్టుకుంది.  సౌర, పవన విద్యుత్   రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేలా కొత్త విధానం రూపోందించింది. కొత్త పునరుద్పాదక ఇంధన విధానంలో భాగంగా సౌర ఫలకాలు, పవన విద్యుత్ టర్బైన్ల తయారీకీ ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.  

 

 


అంతే కాదు.. ఉత్పత్తి చేసిన విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు విక్రయించాలని ఏపీ నిర్ణయించింది. ఇంకా.. దేశీయంగా సౌర విద్యుత్ ఫలకాల దిగుమతిని నిరుత్సాహపరిచేందుకు కేంద్రం విధించిన బేసిక్ కస్టమ్ డ్యూటీ భారాన్ని తగ్గించుకునేందుకు సవరణలు చేపట్టింది. దీర్ఘకాలంలో సౌర విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా కొనుగోలు చేసే విద్యుత్ టారిఫ్ లో భారం పడకుండా సదరు సంస్థలకు ఇచ్చే లీజు తగ్గించింది. ఇంకా ఇందులో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించటం లక్ష్యంగా 10 వేల మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టు ను ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: