బీసీ కులాల ప్రజలకు శుభవార్త చెప్పిన జగన్... కార్పొరేషన్ల ఏర్పాటు గురించి కీలక ప్రకటన....?

Reddy P Rajasekhar

ఏపీ సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జగన్ నేడు కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల చివరినాటికి బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల భర్తీ పూర్తవుతుందని సీఎం ఈ సమావేశంలో స్పష్టం చేశారు. 
 
బీసీల‌కు 52 కార్పొరేష‌న్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కీలక ప్రకటన చేశారు. బీసీల్లోని ఆయా కులాల వారికి ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని కార్పొరేషన్లు పర్యవేక్షించాలని జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మొదట లోతుగా అధ్యయనం చేసి మొత్తంగా 52 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. 30 – 35 వేల జనాభా ఉన్న కులానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. 
 
ప్రతి కులాన్ని ఏదో ఒక కార్పొరేషన్‌లో చేర్చడం జరిగిందని సీఎంకు నిశితంగా అధికారులు వివరించారు. గతంలో 69 కులాలను మాత్రమే కార్పొరేషన్ల ద్వారా పరిగణనలోకి తీసుకోగా ప్రస్తుతం 139 కులాలకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు చెప్పుకొచ్చారు. జగన్ సమావేశంలో అధికారులకు ఒక్క రూపాయి లంచం, వివక్ష లేకుండా తలుపుతట్టి మరీ పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల నగదు బదిలీ ద్వారా అందించామని సీఎం పేర్కొన్నారు. 
 
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని వీటి ద్వారా స్కిల్స్‌ను అప్‌గ్రేడ్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. జర్మనీలాంటి దేశాలకు చెందిన అనేక పెద్ద పెద్ద సంస్థలు ఈ కాలేజీలలో భాగస్వాములుగా ఉంటాయని తెలిపారు. ప్రతి కార్పొరేషన్‌లో 7 నుంచి 12 మంది డైరెక్టర్లు ఉండాలని... నెలాఖరులోగా 52 కార్పొరేషన్ల ఛైర్మన్లతో పాటు, బోర్డుల డైరెక్టర్ల నియామకాలు పూర్తి చేయాలని సీఎం చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: