ఈ మూడు లక్షణాలు ఉంటే కరోనానే... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న వైద్యులు....?

Reddy P Rajasekhar

మార్చి నెల తొలి వారంలో మొదలైన కరోనా ఉధృతి నాలుగున్నర నెలలైనా ఆగడం లేదు. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసుల వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ గురించి, వ్యాక్సిన్ గురించి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. 2020 చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తోన్న కరోన మహమ్మారి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్నాయి. అయితే కొంతమందిలో మాత్రం కరోనాకు సంబంధించిన ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా పరీక్షల్లో మాత్రం పాజిటివ్ గా నిర్ధారణ అవుతోంది. అయితే కరోనాపై పరిశోధనలు చేస్తున్న అమెరికా ఆరోగ్య సంరక్షణ సంస్థ(సీడీసీ) పలు కీలక విషయాలను వెల్లడించింది. 164 మంది కరోనా బాధితులపై పరిశోధనలు చేసి కరోనా రోగుల్లో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది. 
 
వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే కరోనానే కావచ్చని... 45 శాతం మందిలో ఈ మూడు లక్షణాలు కనిపించాయని సీడీసీ చెబుతోంది. కరోనా సోకిన 96 శాతం మంది రోగుల్లో ఈ మూడు లక్షణాల్లో ఏదో ఒకటి కనిపించిందని చెబుతున్నాయి. ఫ్లూ, జలుబు లక్షణాలతో చాలామందిలో కరోనా ప్రారంభం అవుతున్నట్లు సీడీసీ అభిప్రాయపడింది. 
 
కరోనా సోకిన తర్వాత 2 నుంచి 14 రోజుల్లో జ్వరం కనిపిస్తోందని మూడు రోజులకు పైగా జ్వరం ఉన్నా కరోనా కావచ్చని వాళ్లు చెప్పారు. శ్వాస సంబంధిత సమస్యలు, జీర్ణాశయ సమస్యలు, వికారం, కడుపు తిమ్మిరి, చలి, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు ఉన్నా కరోనా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం ద్వారా మాత్రమే వైరస్ భారీన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: