వామ్మో.. కరోనా వైరస్ కోసం చైనా చేస్తున్న అరాచకాలు చూశారా..?
కరోనా వైరస్ కు వ్యాక్సీన్.. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏదైనా ఉందంటే అది ఇదే.. ఈ వ్యాక్సీన్ కోసం ప్రపంచంలోని అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. సైంటిస్టులంతా ఆ పని మీదే ఉన్నారు. కరోనాను తుదముట్టించే వ్యాక్సీన్ ను త్వరగా రూపొందించిన కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన కంపెనీ అయినా ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
కరోనా వ్యాక్సీన్ అంటూ మార్కెట్లోకి రావాలి కానీ.. ఎంత డబ్బు ఇచ్చి అయినా కొనేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. దిగుమతి చేసుకునేందుకు దేశాలు రెడీగా ఉన్నాయి. కరోనా వైరస్ ను అరికట్టే మందులకే విపరీతమైన డిమాండ్ ఉందిప్పుడు.. అలాంటిది ఏకంగా వ్యాక్సీన్ వస్తే.. డబ్బుకు జనం వెనుకాడతారా..?
అందుకే ఈ వ్యాక్సీన్ ను అందరికంటే ముందు తేవాలన్న ఆలోచనతో చైనా అనేక అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే చివరకు హత్యలకు కూడా ఆ దేశం వెనకడుగు వేయడం లేదని చెబుతున్నారు. ఇటీవల అమెరికాలో కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న ఓ శాస్త్రవేత్త హత్యకు గురయ్యాడు. చైనాలో పుట్టి పెరిగిన బింగ్ ల్యూ అనే సైంటిస్ట్ పిట్స్ బర్గ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఆయన కరోనావైరస్ పరిశోధనల్లో ఆయన కీలక దశకు చేరుకున్నాడట. కరోనా వైరస్ కణాలు ఎలా స్పందిస్తాయనే అంశంపై ఆయన పరిశోధనలు చేస్తున్నాడట. అంతే.. మే 6వ తేదీన ఆయన్ను కాల్చి చంపేశారు. ఆయన కరోనా వ్యాక్సీన్ కనిపెడతాడన్న కారణంతోనే చైనా గూఢచారులు ఆయన్ను చంపేశారని ఆరోపణలు వస్తున్నాయి.