యోగి ఎన్ కౌంటర్ కి కౌంటర్ ఇచ్చేందుకు గట్టి ప్రయత్నాలు.. ఇప్పుడే ఎందుకో..?

praveen

భారత్ లో  క్రైమ్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది ఉత్తరప్రదేశ్ దాదాపు ఏళ్ల నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రౌడీయిజం ఒక రేంజ్ లో ఉండేది. సామాన్య ప్రజలను రౌడీలు పీక్కు  తింటుండేవారు. అయితే ప్రభుత్వాలు మారితే తమ జీవితాలు మారతాయి  అనుకున్న  ప్రజల ఆశలు  మాత్రం అడియాశలు అయ్యాయి. కానీ ప్రజల పాలిట దేవుడిగా.. సమస్యలను తీర్చే ధీరుడిగా ఒక్కడొచ్చాడు.. ఆయనే ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. మొదట్లో ఒక సన్యాసిని  రాష్ట్ర ముఖ్యమంత్రిని  చేయడం ఏంటని  విమర్శలు చేశారు. కానీ ప్రస్తుతం ఆయన పాలన చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. 


 ఎప్పుడైతే ఉత్తరప్రదేశ్ లో  యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో  రౌడీయిజం పై ఉక్కుపాదం మోపింది అనే  చెప్పాలి. ఏపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత పరమైన వివాదాలు లేవు.. రౌడీల ఆగడాలు లేవు.. ప్రజలకు సుపరిపాలన అందించారు. అయితే ఇప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీయిజాన్ని అరికట్టేందుకు వేలల్లో  ఎన్కౌంటర్లు జరిగాయి. దీంతో ఎవరైనా నేరాలకు పాల్పడాలంటేనే  వెన్నులో వణుకు పుట్టాల్సిన  పరిస్థితి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అయితే.. ఏదైనా వ్యవస్థ బ్రష్టు పట్టి పోతుంది అంటే ఎవరు కూడా ప్రశ్నించేందుకు ముందుకు రారు.. కానీ ఎవరైనా మంచి చేయడానికి వచ్చారు అంటే మాత్రం అది అడ్డుకోవడానికి ఎంతోమంది తెరమీదికి వస్తూనే ఉంటారు. 

 

 యోగి ఆదిత్యనాథ్ సర్కార్ విషయంలో కూడా పలువురు వ్యవహరిస్తున్న తీరు ఇలాగే ఉంది. యూపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 3200 ఎన్ కౌంటర్లు జరుగగా.. 119 మంది చనిపోయారని దీనిపై సుప్రీంకోర్టు సహా మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించాలి  అంటూ ప్రశాంత్ భూషణ్ లాంటి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇలా ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోతే ఈ పోకడ ఎక్కడ వరకు వెళుతుంది.. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఆరోపణలు చేస్తూ అటు సుప్రీంకోర్టు పైన ఇటు మానవ హక్కుల కమిషన్ దగ్గర కూడా మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో రౌడీలు అరాచకాలకు పాల్పడినప్పుడు గుర్తురాని మానవ హక్కులు  ప్రస్తుతం మంచి జరుగుతుంటే  ఎందుకు గుర్తొస్తున్నాయి అంటూ ప్రశ్నిస్తున్నారు  విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: