హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: శ్రీశైలంలో శిల్పా వన్ మ్యాన్ షో...
ఏపీ రాజకీయాల్లో శిల్పా బ్రదర్స్‌కు అంటూ ఓ గుర్తింపు ఉంది. కర్నూలు జిల్లాలో వారికంటూ ఓ ఫాలోయింగ్ ఉంది. కానీ ఎంత ఫాలోయింగ్ ఉన్నా సరే శిల్పా బ్రదర్స్ మొదట్లో రాజకీయంగా పెద్ద సక్సెస్ కాలేదు. టీడీపీలో ఉన్నన్ని రోజులు వీరికి రాజకీయంగా అంత కలిసిరాలేదు. కానీ 2017లో మాత్రం నంద్యాల ఉపఎన్నికల సమయమలో వీరి రాజకీయం జీవితం ఓ మలుపు తిరిగింది.
టీడీపీలో టిక్కెట్ దక్కదని చెప్పి శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వెళ్ళి పోటీకి దిగారు. కొన్నిరోజులకు శిల్పా చక్రపాణిరెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి వదులుకుని వైసీపీలోకి వెళ్లారు. కానీ నంద్యాల ఉపఎన్నికలో మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. ఇటు మోహన్ రెడ్డి ఓడిపోవడం, చక్రపాణి రెడ్డి ఎమ్మెల్సీ పదవి వదులుకోవడంతో, రాజకీయంగా వీరి జీవితం క్లోజ్ అయిపోయిందని అంతా అనుకున్నారు.
కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ శిల్పా బ్రదర్స్‌కు బాగా కలిసొచ్చింది. మోహన్ రెడ్డి తనయుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి నంద్యాల నుంచి పోటీ చేసి గెలవగా, చక్రపాణిరెడ్డి శ్రీశైలం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్ధి బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై 38 వేల మెజారిటీతో గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి చక్రపాణి రెడ్డి దూకుడుగా పనిచేస్తున్నారు.
ప్రతిరోజూ నియోజకవర్గంలో ఏదొక చోట పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో ఉన్న తాగునీటి సమస్యని పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఇటీవలే వెలుగోడు మండలం రేగడగూడూరు, మాధవరం, మోతుకూరు గ్రామాల్లో పైపు లైన్ ద్వారా రక్షిత మంచి నీటి సరఫరా వ్యవస్థని ప్రారంభించారు.
ఇక పార్టీ పరంగా చూసుకుంటే శ్రీశైలంలో శిల్పా స్ట్రాంగ్ ఉండటం వల్ల, వైసీపీకి తిరుగులేదనే చెప్పొచ్చు. ఇక్కడ టీడీపీ తరుపున బుడ్డా రాజశేఖర్ పెద్దగా ప్రభావం చూపించే స్టేజ్‌లో లేరు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకే మెజారిటీ స్థానాలు దక్కడం ఖాయం. మొత్తానికైతే శ్రీశైలంలో శిల్పా వన్ మ్యాన్ షో ఉండటం వల్ల, భవిష్యత్‌లో టీడీపీ పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు.