మద్యం ప్రియులకు మరో గుడ్ న్యూస్..?
దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత లాక్ డౌన్ విధించడం కారణంగా మద్యం దుకాణాలు మూసి వేయడంతో మందుబాబులు తీవ్ర నిరీక్షణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో మందుబాబులు మద్యం దుకాణాలకు బారులు తీరిన సంఘటనలు మనం చూశాం. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు ఇచ్చినప్పటికీ కొన్ని రాష్ట్రాలలో మాత్రమే మద్యం షాపులు తెరుచుకోలేదు. అయితే తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం మద్యం షాపులు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ.. బార్లు నిర్వహణకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. అయితే తాజాగా బార్ల కి కూడా అనుమతి ఇస్తూ రాజస్థాన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
జూన్ 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోటళ్లు రెస్టారెంట్లు మద్యం దుకాణాలు ప్రారంభం అయినప్పటికీ.. బార్ల నిర్వహణ విషయంలో ఎటువంటి నిర్ణయం వెలువడక పోవడంతో ఇప్పటివరకూ రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లను మూసివేశారు. ఇక తాజాగా ప్రభుత్వం నుండి బార్ల నిర్వహణకు ఉత్తర్వులు రావడంతో... ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అండ్ రెస్టారెంట్లు తెరచుకొనున్నాయి. అయితే బార్లు రెస్టారెంట్లు తెరుచుకునేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ... అదే సమయంలో పలు నిబంధనలు కూడా విధించింది రాష్ట్ర ప్రభుత్వం.
సామాజిక దూరం పాటించడం శానిటైసెషన్ ప్రక్రియ చేపట్టడం లాంటి నిబంధనల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బార్లకు అనుమతులు ఇచ్చింది. అదే సమయంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు యధావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది అంటూ స్పష్టం చేసింది .ఈ నేపథ్యంలో ప్రస్తుతం బార్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించిన తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందేలాగా తమ తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు బార్ల యాజమాన్యాలు . అయితే రాజస్థాన్లో ఇలా బార్లు తెరుచుకోవడం మందుబాబులకు ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి.