పబ్ జీ గేమ్ అసలు చైనాదేనా.. ఇదిగో పూర్తి వివరాలు..?

praveen

దేశ సరిహద్దులో చైనా భారత్ మధ్య తలెత్తిన వివాదం లో ఏకంగా 20 మంది అమరవీరుల అయిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా కు సంబంధించిన అన్ని వస్తువులను యాప్ లను  బహిష్కరించాలి అంటూ ఒక నినాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పాతుకుపోతుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది చైనా వస్తువులను నిషేధించిన విషయం తెలిసిందే. చైనా ఉత్పత్తులను బహిష్కరించడం తో పాటు ఇప్పటికే వాడుతున్న చైనా వస్తువులను కూడా బయట పడేస్తున్న ఘటనలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. 

 

 ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం యాప్ ల విషయంలో కొంతమంది అయోమయంలో పడ్డారు. ఏది చైనా యాప్ అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రభావితం చేసిన పబ్జి గేమ్ గురించి ఎంతో మంది యువత సతమతమవుతున్నారు. పబ్జి గేమ్ చైనాదేనా అన్న  ప్రశ్న ప్రస్తుతం ఎంతమందికి  ఉంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో లాక్ డౌన్  సమయంలో ఇంట్లోనే ఉండి ఫోన్లకు మరింత అతుక్కుపోయి విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్జీ చైనాదేనా  డిలిట్ చేయాల్సిందేనా  అని అంటున్నారు కొంతమంది నెటిజన్లు. 

 


 ఈ నేపథ్యంలో అసలు పబ్జి ఎటు నుంచి వచ్చింది అనే వివరాలను తెలుసుకునేందుకు గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. అయితే దీనికి సమాధానం ఏమిటి అంటే... సాంకేతిక పరంగా చూసుకుంటే పబ్జి అసలు చైనా ది కాదు... ఎందుకంటే ఈ పబ్జి గేమ్ ను ఐర్లాండ్కు చెందిన బ్రెదర్ గ్రీన్  అనే వ్యక్తి డెవలప్ చేశాడు... ఈ గేమ్ను దక్షిణ కొరియాలోని బ్లూ హోల్ డెస్క్టాప్ పై అందుబాటులోకి తీసుకువచ్చింది... ఇక ఈ పబ్జి గేమ్ మొబైల్ వర్షన్ లోకి తీసుకొచ్చేందుకు చైనాకు చెందిన టెనెంట్  గేమ్స్ సహాయం చేస్తూనే... బ్లూ హోల్ లో 10 శాతం వాటాను తీసుకుంది. అంతే తప్ప పబ్జికి  చైనాకు ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు ఈ గేమ్ లో  తీవ్రమైన హింస ఉందని భావించి చైనా దేశంలో పబ్ జీ  విడుదల చేయకముందే బ్యాన్  చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: