జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ : మమ్మల్ని ఏమీ పీకలేరు... నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు...?
పోలీసుల సంతకాలనే ఫోర్జరీ చేసిన ఘటనలో తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పోలీసులు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల విక్రయానికి సంబంధించి పోలీసు సంతకాలను ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ స్టాంపులతో రవాణా శాఖకు ఎన్‌ఓసీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. అనంతరం వీటిని తెలంగాణలో విక్రయించారు.
రవాణాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు కాగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. నిన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని సందర్శించి జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రిమాండ్ లో ఉన్నవారిని కలవాలని లోకేష్ ప్రయత్నించినా జైలు అధికారుల నుంచి ఆయనకు అనుమతి లభించలేదు.
జేసీ కుటుంబాన్ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ లాగా ఆర్థిక నేరస్థుడు కాదని అన్నారు. జేసీ ప్రభాకర్, అస్మిత్ పై పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులు అని చెప్పారు. అన్నీ రాసుకుంటామని.... వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వ్యాఖ్యలు చేశారు. అప్పుడు మీ తాతను చూశానని... తర్వాత మీ నాన్నను చూశానని... ఇప్పుడు నిన్ను చూస్తున్నానని... మమ్మల్ని ఏమీ పీకలేరని జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైయస్ జగన్ అచ్చెన్నాయుడు కుటుంబంలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలను వైసీపీలో చేరాలని తన సలహాదారుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, కింజరాపు రామ్మోహన్ నాయుడులపై పార్టీ ఫిరాయింపులకు పాల్పడమని ఒత్తిళ్లు తెచ్చారని అన్నారు. తనను, చంద్రబాబును జైలు పాలు చేయాలని జగన్ కుట్ర పన్నారని లోకేష్ వ్యాఖ్యలు చేశారు.