కశ్మీర్‌లో సైన్యానికి భారీ విజయం.. మూడు రోజుల్లో 14 మంది ఉగ్రవాదులు హతం....?

Reddy P Rajasekhar

కశ్మీర్ లో భారత సైన్యానికి భారీ విజయం దక్కింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో భారత సైన్యం 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. సాధారణంగా ఏదైనా నేరం జరిగితే ఒక ఆధారం దొరికితే దాని ద్వారా మరికొన్ని ఆధారాలు దొరుకుతాయి. అదే విధంగా ఉగ్రవాదులను పట్టుకున్న సమయంలో కూడా వారి లింక్ లను కనిపెట్టడం ద్వారా ఇతర ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. 
 
షోపియాన్ జిల్లాల్లో నిన్న తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదు మంది ఉగ్రవాదులు సైన్యం చితిలో హతమయ్యారు. అధికారుల నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. జిల్లాలోని సుగూ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం అందడంతో సైన్యం నిర్భంధ తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం ఎదురు కాల్పులు జరిగింది. 
 
జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను చేపట్టాయి. మూడు రోజుల్లో సైన్యం 14 మంది ఉగ్రవాదులు సైన్యం చేతిలో హతమయ్యారు. జనాలలో కలిసిపోయిన ఉగ్రవాదులను సైన్యం కనిపెట్టి ఏరివేసే కార్యక్రమం శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది. 18 రోజుల్లోనే 10 ఆపరేషన్లు నిర్వహించి, 26 మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టికరిపించింది. 
 
సైన్యం హతమార్చిన వారిలో పది మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఉన్నారని తెలుస్తోంది. సైన్యం వైపు ఎలాంటి నష్టం జరగకుండా తెలివిగా ముష్కరులను మట్టుబెట్టింది. మరణించిన ఉగ్రవాదులు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దిన్‌కు చెందిన వారని తెలుస్తోంది. ఈ ఘటనల్లో పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.                                     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: