మీడియా మంటలు: ఏపీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు సిగ్గూ ఎగ్గూ లేదట? ఆర్కే రంకెలు..?

Chakravarthi Kalyan
ఐఏఎస్, ఐపీఎస్.. బాగా చదువుకునే ప్రతి ఒక విద్యార్థి కల ఇది. ఎందుకంటే.. ఈ దేశంలో ఇవే అత్యున్నత ఉద్యోగాలు.. పేరుకు ఉద్యోగమే అయినా నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఉద్యోగాలు.. ప్రజలకు కావాల్సిన పథకాలు రూపొందించేది, అమలు చేసేదీ వీరే.. అందుకే ఈ ఉద్యోగాలకు అంత క్రేజ్. లక్షల మంది పోటీపడితే.. వేల మంది ఇంటర్వ్యూ వరకూ వస్తే.. వందల మంది మాత్రమే ఐఏఎస్, ఐపీఎస్‌లు అవుతారు.

ఈ ప్రక్రియలో ఎక్కడ అడుగు తడబడినా మళ్లీ మొదటి నుంచి రావాల్సిందే.మరి అంత కష్టపడి చదివి.. ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగంలో చేరాక వీరు ఏం చేస్తున్నారు. తాము ఈ ఉద్యోగంలోకి వచ్చాక ఏం చేయాలనుకున్నారో అవేమీ చేయడం లేదా.. సిగ్గూ ఎగ్గూ లేకుండా రాజకీయ నాయకుల తొత్తులుగా మారిపోతున్నారా.. అవునంటున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ. ఆయన తన తాజా కొత్త పలుకు వ్యాసంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

ప్రత్యేకించి ఇప్పుడు ఏపీలో జగన్ దగ్గర పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్‌లకు సిగ్గూఎగ్గూ లేదట. అసలు ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంతలా వెన్నెముక లేకుండా ఎందుకు తయారయ్యారో అర్థంకావడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఆర్కే. ఆయన ఇంకా ఏమని సూత్రీకరిస్తున్నారంటే..." ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు సర్వీసులో చేరిన కొత్తలో గరంగరంగా అంటే కఠినంగా వ్యవహరిస్తారట. ఆ తర్వాత కొంతకాలానికి నరమ్‌ నరమ్‌ అయిపోతారట. అంటే మెత్తబడిపోతారని అర్థం. చివరకు రిటైరయ్యేనాటికి బేషరమ్‌గా అంటే సిగ్గు లేకుండా తయారవుతారట! అఖిల భారత సర్వీసు అధికారులే తమ గురించి ఈ వ్యాఖ్యలు చేసుకుంటూ ఉంటారట.

సర్వీసు చివరి దశలో బేషరమ్‌గా మారడానికి కొంతమంది అధికారులు సిద్ధపడినా, ఇంకొందరు మాత్రం రిటైరయ్యే వరకు నిక్కచ్చిగానే బతుకుతారట. దురదృష్టవశాత్తు ఏపీలో ఇటువంటివారు కరువయ్యారట. మరి ఐఏఎస్, ఐపీఎస్‌లపై ఇంత దారుణంగా కామెంట్ చేసిన ఆర్కేతో ఆ అధికారులు ఏకీభవిస్తారా.. ఖండిస్తారా..అసలు స్పందిస్తారా.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: