వేదిక పైనే కన్నీళ్లు పెట్టుకున్న తెలంగాణ మంత్రి..?
జూన్ 2 తెలంగాణ ప్రజానీకానికి ఒక ప్రత్యేకమైన రోజు. దశాబ్దాల నుంచి తెలంగాణ ప్రజానీకం మొత్తం ధృడ సంకల్పంతో చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కిన రోజు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని తెలంగాణ ప్రజలు నమ్మి పోరాటానికి ముందుకు కదలగా వారి ఆశయాలు మొత్తం నెరవేరని రోజు. ఎంతోమంది తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు ఫలితం దక్కిన రోజు ఈ రోజు. ఉద్యమ సారథి కెసిఆర్ ఎన్నో ఏళ్ల కల నెరవేరే రోజు ఈ రోజు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఎంతో గొప్పగా జరుపుకుంటుంది. పార్టీలకతీతంగా అన్ని పార్టీల వారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఇక టిఆర్ఎస్ పార్టీ అయితే ప్రతి చోట తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుతు రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ ఉన్నారు. ఇక ఎంతో మంది ఇతర రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు సైతం తెలంగాణ ఉద్యమ కాలాన్ని గుర్తు చేసుకుంటూ అమరుల త్యాగాలకు నివాళులర్పిస్తారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ఎంతోమంది రాజకీయ సినీ ప్రముఖులు సైతం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబరాల్లో పాల్గొన్న టిఆర్ఎస్ మంత్రి ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు.
జెండా ఆవిష్కరణ ముగిసిన తర్వాత ఏకంగా వేదికపైనే తెలంగాణ మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది అమరుల త్యాగాలను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇది ఎంతో మంది ప్రాణ త్యాగాల తెలంగాణ అని ఉట్టితెలంగాణ కాదు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన ఎంతోమంది అమరవీరుల ఆశయాలు తప్పక నెరవేరుతాయని అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమరుల ఆశయాలు సాధ్యం అయ్యేంతవరకు పాటుపడతాం అంటూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు.