టీటీడీ ఆస్తుల రగడ : ఆస్తుల అమ్మకాల విషయంలో విషయంలో టీటీడీ సంచలన నిర్ణయం... విమర్శలకు నో ఛాన్స్...!

Reddy P Rajasekhar

గత కొన్ని రోజులుగా టీటీడీ ఆస్తుల రగడ తెలుగు రాష్టాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే టీటీడీ ఆస్తుల రగడపై విమర్శలు వెల్లువెత్తటంతో టీటీడీ పాలక మండలి ఆస్తుల అమ్మకాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. కానుకల రూపంలో ఆలయానికి భక్తులు ఇచ్చిన ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేసింది. అయితే ఆ ఆస్తులను ఎలా వినియోగించాలనే అంశంపై భక్తులు, మేధావులు, స్వామీజీలతో కలిసి కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది 
 
భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటూ... దేవునికి కానుకల రూపంలో ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలకు తావు లేకుండా టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ పాలకమండలి గత కొన్ని రోజులుగా కొన్ని రాజకీయ పార్టీలు, పత్రికలు, ఛానెళ్లు, కొందరు వ్యక్తులు ఆస్తుల అమ్మకాల విషయంలో చేసిన దుష్ప్రచారం గురించి విజిలెన్స్ సంస్థతో దర్యాప్తు జరిపించేలా ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. 
 
టీటీడీపై విమర్శలకు తావు లేకుండా పాలాకమండలి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కాగా వెబ్ సైట్ లో ఆస్తులకు సంబంధించిన వివరాలను ఉంచాలని నిర్ణయించింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బోర్డు తీసుకున్న నిర్ణయాల గురించి మీడియాకు వివరించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడూతూ టీటీడీ ఆస్తుల అమ్మకాలపై గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ప్రచారాన్ని బోర్డు ఖండించిందని అన్నారు. 
 
గత ప్రభుత్వం ఆస్తుల అమ్మకానికి సంబంధించి నిర్ణయం తీసుకుందని... ఆ నిర్ణయాన్ని తాము సమీక్షించినా కొందరు కావాలని దుష్ప్రచారం చేశారని అన్నారు. సీఎం జగన్ ఆస్తులు అమ్మకూడదని జీవో జారీ చేశారని.... విశ్రాంతి గృహాల నిర్మాణాల విషయంలో మార్గదర్శకాలను పాటించి అర్హులైన వారికే విశ్రాంతి గృహాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారని చెప్పారు. అతిథి గృహాల కోసం నిర్వహించిన టెండర్ల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: