కుక్క పిల్ల అనుకోని ఇంటికి తెచ్చుకున్నాడు...! కానీ తీరా చూస్తే అది ....?
కొంత మందికి పెట్స్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుత రోజుల్లో మనుషుల కంటే వాటినే ఎక్కువగా ప్రేమించేస్తున్నారు. ఈ తరుణంలో ఒక దారి తప్పి పోయిన నక్కపిల్లని ఒక వ్యక్తి దాని యజమానితో కలపడానికి చాలా శ్రమించాడు అనే చెప్పాలి. చివరికి నిజం తెలుసుకొని భయపడిపోయాడు. ఈ సంఘటన జపాన్ దేశంలో చోటు చేసుకుంది. ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళ్తే... మ్యార్సి డాట్ కామ్ అనే ట్విటర్ యూజర్ కొన్ని రోజుల కిందట రోడ్డు పక్కన ఒక జంతువు కనిపించింది. అది కుక్క పిల్ల అనుకోని ఆ యువకుడు దాన్ని ఇంటికి తీసుకుని వెళ్లడం జరిగింది.
子狐ちゃんを北きつね牧場さんへ引き渡し完了いたしました。
月形町で保護したので「ルナ」と命名させていただきました。
帰る頃には同じ年頃の子狐ちゃんと一緒になって寝ておりました。
この度はご協力いただきありがとうございました
機会がありましたらルナに会いに行っていただけると幸いです pic.twitter.com/vgl9iNDlvx — MARCY (@marcy_com) May 3, 2020
అయితే అది కుక్కపిల్ల అనుకొని ఆ పిల్లని యజమానితో కలపాలి అనుకున్న అతను యజమాని ఎవరికైనా తెలిస్తే చెప్పాలి అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. వాళ్ల యజమాని ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పాలి అంటూ కోరడం జరిగింది. అంతే కాకుండా యజమాని వద్దకు నేను చేర్చడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కోరడం జరిగింది. ఇక ఈ ట్వీట్ పై స్పందించిన ఒక నెటిజన్ అది కుక్క పిల్ల కాదు బాబు నక్కపిల్ల అని... అంతేకూండా ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాము అక్కడే వదిలేయ్ అని తెలిపాడు,.
ఆ యువకునికి అది కుక్క పిల్లనా, నక్కపిల్లనా అన్న అనుమానం వచ్చింది. వెంటనే ఆ యువకుడు దగ్గరలో ఉన్న జంతువు వైద్యుడి దగ్గరకు తీసుకు వెళ్లడం జరిగింది. వైద్యుడు పరీక్షలు నిర్వహించిన అనంతరం అది కుక్క పిల్ల కాదని అది అడవి నక్కపిల్ల అని అతడికి తెలియజేయడం జరిగింది. దీనితో మ్యార్సి డాట్ కామ్ ఆ నక్క పిల్లను అడవిలో వదిలి వేయడం జరిగింది. కాబట్టి మీకు కూడా ఎవరికన్నా ఇలాంటి మంచి అలవాట్లు ఉంటే ముందు అది ఏ రకమైన జంతువు అని నిర్దారించుకొని దాన్ని పెంచుకోవడమో, ఇక ఏదైనా చేయడమో చేయండి. లేకపోతే ఇబ్బందులు ఎదురుకోవలిసి వస్తుంది.