బీచ్ లో అలా చేయటంతో నిరాశ చెందాను..?
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే . ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ మహమ్మారి వైరస్ తో వణికిపోతున్నాయ. ఆయా దేశాల ప్రభత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ మహమ్మారి వైరస్ ప్రభావం మాత్రం తగ్గడం లేదు. అయితే ఈ వైరస్ వెలుగులోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఈ వైరస్ వ్యాక్సిన్ లేకపోవడం మరింత ఆందోళన కలిగించే అంశం అన్న విషయం తెలిసిందే. అయితే ఇక మొన్నటివరకు దాదాపుగా అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ పూర్తిస్థాయిలో అమలు అయింది. అంతేకాకుండా ప్రజలందరూ ఇంటి పట్టునే ఉన్నారు.
ఇక ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నుంచి ఆదేశాలు పలు సడలింపు ఇస్తున్న విషయం తెలిసిందే. సడలింపు లో భాగంగా వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు బయట తిరిగేందుకు అనుమతులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే పర్యాటక ప్రాంతంగా ఎంతో పేరుగాంచిన లాస్ ఏంజెల్స్ కౌంటి బీచ్ తెరుస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే లాక్ డౌన్ సడలింపు ఇచ్చినప్పటికీ ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.
అయితే ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ కౌంటీ బీచ్ ను ప్రభుత్వం తెరుస్తూ ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఎంతో మంది పర్యాటకులు లాస్ ఏంజెల్స్ బీచ్ కి సేదతీరేందుకు వస్తున్నారు. దీంతో లాస్ ఏంజిల్స్ లోని బీచ్ మొత్తం పర్యాటకులతో నిండిపోతుంది. ఇక పర్యాటకులు ఎక్కువగా ఉంటే ఈ మహమ్మారి కరోనా వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే తగిన జాగ్రత్తలు పాటిస్తే వైరస్ నుంచి తప్పించుకోవచ్చు. కానీ తాజాగా కౌంటీ బీచ్ లో కి వచ్చిన పర్యాటకులు ఎలాంటి మాస్కులు ధరించకుండా సరదాగా గడుపుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది. వీడియో ని ఒక మహిళ పోస్ట్ చేస్తూ ఇలా ముసుగులు ధరించక పోవటం ఎంతో నిరాశ పరిచింది అంటూ చెప్పుకొచ్చింది.
As beaches reopened in Los Angeles County, a beachgoer in Manhattan beach was disappointed to see people not wearing masks pic.twitter.com/2VZlHU1Luu — Reuters (@Reuters) May 14, 2020