విశాఖ వాసులకు బిగ్ గుడ్‌ న్యూస్ - జగన్ సర్కారు షాకింగ్ నిర్ణయం..?

Chakravarthi Kalyan
విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన ఘోర విషవాయువు లీకేజీ ఘటన తర్వాత పరిశ్రమ విషయంలో ఏపీ సర్కారు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్ జి పాలిమర్ కంపెనీకి సంబంధించి అధికారిక నివేదిక వచ్చే వరకు ఆ సంస్థను మూసే ఉంచుతారని తేల్చి చెప్పింది. తమకు ప్రజల ప్రాణాలే ప్రథమ ప్రాధాన్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

వైసీపీ ప్రజల ప్రాణాలకే ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">బొత్స సత్య నారాయణ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని అనుకుంటున్నారని మంత్రి బొత్స చెప్పారు. కాని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ లో కూర్చుని రాజకీయం చేస్తున్నారని మంత్రి బొత్స విమర్శించారు.

ఆదివారం సాయంత్రానికి అదికారిక నివేదిక వస్తుందని మంత్రి బొత్స తెలిపారు. అంతవరకు ఐదు గ్రామాల ప్రజలు అక్కడకు వెళ్లవద్దని ఆయన సూచించారు. లాక్ డౌన్ కాలంలో నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందని కొందరు అంటున్నారు. కోటి పరిహారాన్ని ప్రాణం ఖరీదుగా ప్రతిపక్షం చూడడం దారుణమని అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఈ విషయం స్పష్టంగా చెప్పారని, పోయిన ప్రాణాలకు విలువ కట్టలేమని అన్నారని ఆయన గుర్తు చేశారు. కమిటీ నివేదిక వచ్చాక అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మంత్రి బొత్స మాటలు విశాఖ వాసులకు ఊరట కలిగించాయి. తాత్కాలికంగా పరిశ్రమను మూసేయడానికి సర్కారు నిర్ణయించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: