గర్భవతులపై కూడా విరుచుకుపడుతున్న కరోనా మహమ్మారి.. !!

Suma Kallamadi

దేశం మొత్తం కరోనా వైరస్ వల్ల వణికిపోతుంది. చిన్నా, పెద్దా, ముసలి, ముతక, గర్భిణీ, ఆడ, మగ, అని తేడా లేకుండా అందరికీ వ్యాప్తి చెందుతుంది. అయితే కరోనా మహమ్మారి బారినపడుతున్న వాళ్లలో అన్ని వయసుల వారు ఉంటున్నారు. ఇది గర్భవతులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గర్భవతులు సరైన పోషకాహారం తీసుకోకపోతే వ్యాధినిరోధక శక్తి తగ్గి ఈ వైరస్ బారిన పడే  అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఒక సర్వే లో తేలింది.

 

కరోనాతో బాధపడుతున్న 16 దేశాలకు చెందిన 441 మంది గర్భవతులను పరిశీలించారు. వారిలో 96 శాతం మందికి న్యూమోనియా ఉన్నట్టు గుర్తించారు.వాళ్ళు శ్వాసకోశ సమస్యతో భాధ పడుతున్నారు.  సాధారణంగా కొన్ని సందర్భాల్లో మహిళలు నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిస్తుంటారు. ఈ తరహా ప్రసవాల శాతం 13.6 కాగా, కరోనా వైరస్ ప్రభావంతో ఆ రేటు 26కి పెరిగిందట. కరోనా సోకిన గర్భవతులకు నెలలు నిండకముందే ప్రసవాలు జరుగుతున్నట్టు తేలింది. 

 

కాగా ఈ 441 కేసుల్లో 9 మంది గర్భవతులు మరణించగా, నలుగురు శిశువులు ప్రసవానంతరం చనిపోయారు. ఆరు కేసుల్లో శిశువులు తల్లిగర్భంలోనే మృతి చెందారు. ఆయా దేశాల్లో గర్భవతులు కరోనా బారిన పడిన తర్వాత 56 శాతం మంది జ్వరం, 43 శాతం మంది దగ్గు, 19 శాతం మంది కండరాల నొప్పులు, 18 శాతం మంది శ్వాస తీసుకోలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన గర్భవతుల్లో హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. 

 

 అయితే వీళ్ళలో ఎలాంటి కరోనా లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ రావడం గమనార్హం. సుమారు 50 శాతం మంది గర్భవతుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా కరోనా నిర్ధారణ అయిందట.ఒకవేళ కరోనా గర్భిణీ స్త్రీలలో వస్తే అటు తల్లికి, బిడ్డకి ఇద్దరికి ప్రమాదమే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. పసి పిల్లలకి ఇమ్మ్యూనిటి చాలా తక్కువగా ఉంటుంది.అందుకే కొన్ని పాజిటివ్ కేసులలో పుట్టిన బిడ్డలు చనిపోయారు. కొంతమంది కడుపులోనే చనిపోయారు. గర్భవతులు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పోషకాహారం తీసుకుంటే ఎటువంటి సమస్యలు దరిచేరవు... !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: