బిగ్ బ్రేకింగ్ : విశాఖ గ్యాస్ ఘోరంలో ఎనిమిది మంది మృతి..?

Chakravarthi Kalyan
విశాఖ శివార్లలోని ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మొదట్లో ఒకరిద్దరు మరణించారని భావించారు. ఆ తర్వాత ఇద్దరు వృద్ధులు, ఓ చిన్నారి మృతి చెందారని అధికారులు చెప్పారు. కానీ ఆ తర్వాత మృతుల సంఖ్య పెరుగుతోంది.

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఎనిమిది మృతి చెందినట్టు తెలుస్తోంది. విశాఖలోని కేజీ హెచ్ ఆసుపత్రిలోనే ఐదుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. ఆర్ ఆర్ వెంకటాపురంలోనే మరో ముగ్గురు చనిపోయారు. మొత్తం ఇప్పటి వరకూ ఎనిమిది మంది వరకూ మృత్యువాత పడ్డారు. అయితే ఈ సంఖ్య ఎంత వరకూ పెరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.

మహానగరం విశాఖలో దారుణమైన పరిస్థితి నెలకొంది. నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌. వెంకటా పురంలోనిఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమలో భారీగా గ్యాస్ లీకైంది. 3 కి.మీ మేర ఈ గ్యాస్ వ్యాపించింది. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. జనం ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల ఎంత మంది ప్రమాదానికి గురయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది.

దాదాపు 200 మందికి పైగా అస్వస్థతకు గరైనట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరికొన్ని గంటలు గడిస్తే కానీ.. అసలైన ప్రాణ నష్టం ఎంతనేది ఓ అంచనాకు వచ్చే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: