వెంటిలేటర్ ట్రీట్‌మెంట్ ఎంతవరకు ఉపయోగం ?

NAGARJUNA NAKKA

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు కోరలు చాస్తోంది. పాజిటివ్ వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. కొద్దిశాతం మంది మాత్రమే రిస్క్‌లో పడుతున్నారు. వారికి వెంటిలేటర్ ద్వారా ట్రీట్‌మెంట్ ఇవ్వడం తప్పడం లేదు. ఇంతకీ వెంటిలేటర్ ట్రీట్‌మెంట్ కరోనా బాధితులు కోలుకోవడానికి ఎంతవరకు ఉపయోగం.. దానితో దుష్పలితాలేమైనా ఉన్నాయా..? 

 

కోవిడ్-19 తీవ్రత పెరిగిపోవడంతో.. పెద్ద ఎత్తున వెంటిలేటర్లు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నాయి ప్రభుత్వాలు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెంటిలేటర్లను సమకూర్చుకుంటున్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వెంటిలేటర్ల అవసరం పెద్దగా పడకున్నా.. కేసులు తీవ్రత పెరిగితే మాత్రం వెంటిలేటర్లు అవసరం అంటున్నారు వైద్యులు. ప్రస్తుతానికైతే వెంటిలేటర్ల అవసరం తక్కువగానే ఉందంటున్నారు.

 

వాస్తవానికి కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లలో చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కొందరికి వ్యాది లక్షణాలు కనిపించకుంటే.. మరికొందరు మాత్రం దగ్గు, జలుబు, ఫ్లూ లక్షణాలు ఉంటున్నాయి. ఇటువంటి వారందరికీ.. వైరల్ డ్రగ్స్ ఇస్తే సరిపోతుందంటున్నారు వైద్యులు. అయితే, కరోనాతో పాటు ఇతర సమస్యలు వచ్చిన వాళ్లు.. ముఖ్యంగా కోమార్భిట్ వంటివి ఉన్నవాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరణాలు కూడా వాళ్లలోనే ఎక్కువగా ఉంటున్నాయంటున్నారు వైద్యులు. ఇలా పరిస్థితి సీరియస్‌గా ఉండండంతో వెంటిలేటర్ అవసరం పడుతోంది.

 

ఊపిరితిత్తుల పనితీరు సరిగ్గా లేకున్నా.. పనిచేయని పరిస్థితిలో ఉన్నా వెంటిలేటర్ వాడాల్సి వస్తోంది. వెంటిలేటర్ ద్వారానే వాళ్లు రికవరీ అవుతారని అంటున్నారు వైద్యులు.
వాస్తవానికి వెంటిలేటర్ పెట్టాలంటే చాలా స్ట్రాటజీలుంటాయి. వాటితో పాటు కరోనా ప్రభావంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పేషంట్‌ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ.. ఆక్సిజన్ శాతం పడిపోగానే వెంటిలేటర్ పెట్టాలంటున్నారు వైద్యులు. ముఖ్యంగా నైటో కైన్స్ స్టాం వచ్చి,  మల్టి పుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్‌ వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాంటున్నారు.

 

మరోవైపు వెంటిలేటర్ల వల్ల లంగ్స్‌ ఇంజూర్ అవుతాయనే ప్రచారం ఎక్కువగా నడుస్తోంది. దీంతో.. వెంటిలేటర్‌ను రోగుల పరిస్థితిని బట్టి ట్యూబ్ లోపలికి కాకుండా, బయటనుంచే పెడుతామంటున్నారు వైద్యులు. ఎన్ని జాగ్రత్తు వహించినా.. కోవిడ్ లాంటి కేసుల్లో రికవరి మరి తక్కువగా ఉంటుందంటున్నారు డాక్టర్లు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: