హైదరాబాద్: రాష్ర్టపతి రేసులో ఉన్న ప్రణబ్ ముఖర్జీకి పార్టీలతో సంబంధం లేకుండా రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది. రాష్ర్టపతిగా ఎంపిక కావడం ఆయనకు నల్లేరు మీద నడకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు పోటీగా పెద్దగా ఎవరూ రావడం లేదు. దాదాపుగా దేశంలోని మెజార్టీ పార్టీలు ప్రణబ్‌కు మద్దతును తెలుపుతుండటంతో ఆయన ఎంపిక లాంఛనప్రాయంగానే కనిపిస్తోంది.
అమోఘమైన తెలివి తేటలున్న ప్రణబ్ ఎలాంటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలిగే శక్తిసామర్థ్యాలు ఆయన సొంతం. అందుకే ఆయనను అందరూ అపరణ చాణక్యుడుగా పిలుస్తారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రణబ్‌ను ప్రకటించగానే అటు ప్రధాని, ఇటు సోనియా రంగంలోకి దిగారు. దేశంలో ఉన్న అన్ని పార్టీల అధినేతలకు ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ఫోన్ చేసి ప్రణబ్‌కు మద్దతు తెలుపాల్సిందిగా కోరారు. ప్రణబ్‌కు పోటీగా... ఎన్డీఏ మాజీ రాష్ర్టపతి అబ్దుల్ కలాంను దింపాలనుకున్నది కాని కుదరలేదు.
ప్రస్తుతం పీఏ సంగ్మా ఒక్కరు మాత్రమే తను రాష్ర్టపతి పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్‌కు పార్టీలకు సంబంధం లేకుండా అందరూ మద్దతు తెలుపుతున్నా... యూపీఏలోని భాగస్వామ్య పార్టీ అయిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ మాత్రమే ససేమిరా అంటున్నారు. యూపీఏకు సంబంధంలేని పార్టీలైన తెలుగుదేశం, సమాజ్‌వాది, బీఎస్పీ, శివసేన, కర్ణాటకు చెందిన బీజేపీ మాజీ సీఎం యడ్యూరప్ప వర్గం, ఎన్డీయేలోని కొన్ని పక్షాలు, వామపక్షాలు కూడా ప్రణబ్‌కు మద్దతు తెలియజేస్తున్నారు.
రాష్ర్టం విషయానికి వస్తే ఎంఐఎం ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం కూడా ప్రణబ్‌కు మద్దతుకు మొగ్గు కనబరుస్తోంది. తెలంగాణ రాష్ర్ట సమితి కూడా ఇదే దారిలో వుంది. ఉప ఎన్నికల్లో విజయఢంకాను మోగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతును కూడబెట్టడానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రంగంలోకి దిగారు. ఈమేరకు ఒవైసీ చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్‌ను కలిసి మద్దతును కోరారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామనీ జగన్ తనకు హామీ ఇచ్చాడనీ ఒవైసీ చెప్పారు. జగన్ వర్గం కూడా ప్రణబ్‌కు మద్దతు తెలుపవచ్చని సమాచారం. దాదాపుగా దేశంలోని మెజార్టీ పార్టీలు ప్రణబ్ అభ్యర్థిత్వానికి మొగ్గును చూపెడుతున్నాయి. దీనితో రాష్ర్టపతిగా ప్రణబ్ ఎంపికకు పెద్దగా అవాంతరాలు రాకపోవచ్చు.
సంక్షోభ పరిష్కర్తగా పేరున్న ప్రణబ్‌ను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ భవిష్యత్‌ను ద్రుష్టిలో పెట్టుకుని రాష్ర్టపతి అభ్యర్థిగా ప్రకటించిందనీ, అంతే కాకుండా, ఆయన ఎంపికను ప్రతిష్టగా కూడా తీసుకున్నారామె . రాజకీయ దురుంధురైడన ప్రణబ్‌కు పార్టీలతో సంబంధం లేకుండా ప్రత్యేక స్థానం వుంది. ఇదిలా ఉంటే, ముఖ్యంగా 2014 ఎన్నికలను, ఫలితాలను ద్రుష్టిలో పెట్టుకుని ప్రణబ్ అభ్యర్థిత్వాన్ని సోనియాగాంధీ ఖరారు చేశారనీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: