కరోనా జాగ్రత్తలు: ఈ పనులు చేస్తే మీకు కరోనా గ్యారంటీ..?

Chakravarthi Kalyan
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. ఈ కరోనా గురించి మరీ జనం ఎక్కువగా భయపడుతున్నారు. ఎందుకంటే కరోనా వచ్చిన వారిలో నూటికి 3 శాతం మాత్రమే మరణించే అవకాశం ఉంది. మిగిలిన 97 మంది చికిత్స ద్వారా బయటపడవచ్చు. ఇప్పటి వరకూ గణాంకాలు చెబుతున్న వాస్తవాలు ఇవి.

అయితే కరోనా ప్రభావంతో మరణించే అవకాశం ఉన్న ఆ 3 శాతంలో ఎక్కువ మంది 60ఏళ్లు దాటిన వృద్దులే ఉంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండటమే అందుకు కారణం. అందువల్ల ఈ వైరస్ గురించి వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కరోనా వస్తే మరణం వరకూ వెళ్లే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ అవకాశం ఎక్కువగా ఉన్న వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే.. ఇబ్బంది పడతారు.

ఇక వృద్ధులు చేయకూడని పనులు ఏంటంటే.. ముఖాన్ని కప్పుకోకుండా దగ్గడం, తుమ్మడంలాంటివి చేయకూడదు. ఒక వేళ మీరు జ్వరం, దగ్గుతో బాధపడుతుంటే ఇతరులను కలవడం లాంటివి అస్సలు చేయవద్దు. పదే పదే కళ్లు, ముక్కు, ముఖం, నాలుకను తాక కూడదు. అసలే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు.. కరోనా బారిన పడినవారినికి కానీ.. కరోనా బారిన పడిన వారి కుటుంబ సభ్యులను, సన్నిహితులను అస్సలు కలవ కూడదు.

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. వైద్యుల సలహాలు లేకుండా వృద్ధులు ఎలాంటి ఔషధాలను తీసుకోకూడదు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పుడు సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం ఈ కరోనా సమయంలో ఆస్పత్రికి అస్సలు వెళ్లవద్దు. వీలైనంత వరకూ ఫోన్‌లోనే మీ సందేహాలను వైద్యుల ముందు ఉంచడం మంచిది. అత్యవసరం అయితే తప్ప అస్సలు ఇల్లు వదిలి బయటకు రాకుండా ఉండే మరీ మంచిది.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: