ఇక హైదరాబాద్‌లోని ఈ 8 ల్యాబుల్లోనూ కరోనా పరీక్షలు..? ఇదిగో జాబితా..!

Chakravarthi Kalyan
కరోనా మహమ్మారి జోరుగా వ్యాపిస్తున్న సమయంలో అనుమానితులకు వెంటనే పరీక్షలు జరపడం అత్యవసరంగా మారింది. కానీ ఇందుకు వ్యవస్థాపరంగా ఉన్న పరిమిత సౌకర్యాలు అడ్డుగా నిలుస్తున్నాయి. మొదట్లో కరోనా పరీక్షలు నిర్వహించాలంటే శాంపిళ్లను పుణేలోని ప్రభుత్వ వైరాలజీ సంస్థకు పంపి అక్కడి నుంచి నివేదిక వచ్చే వరకూ ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పరీక్షల సౌకర్యాలు కల్పించారు.

అయితే కరోనా రోగులు, అనుమానితుల సంఖ్య పెరుగుతుండటం వల్లే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పరీక్ష సౌకర్యాలు కూడా సరిపోవడం లేదు. కొత్తగా వచ్చే అనుమానిత కేసులతో పాటు.. ఇప్పటికే చికిత్సలో ఉన్న వారికి కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో శాంపిళ్లు పరీక్షించాల్సి వస్తోంది. ఈ తాకిడి తట్టుకునేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రుల సౌకర్యాలను కూడా వినియోగించుకుంటోంది.

ఇక ఇప్పటి నుంచి హైదరాబాద్‌లోని మరో 8 ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆ ఆసుపత్రుల జాబితా ఇదే.

ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైరాలజీ లాబ్స్ తో పాటు ఈ ప్రైవేట్ లాబ్స్ లోను ఇకపై కరోనా పరీక్షల నిర్వహిస్తారు.

1. అపోలో హాస్పిటల్ లాబొరేటరీ సర్వీసెస్, జూబ్లీహిల్స్.

2. విజయా డయాగ్నస్టిక్ సెంటర్, హిమాయత్ నగర్.

3. విమ్టా లాబ్స్ చర్లపల్లి.

4. అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టయిల్ లిమిటెడ్, బోయినపల్లి

5. డాక్టర్ రెమెడీస్, లాబ్ పంజాగుట్ట.

6. పాథాకేర్ లాబ్స్ మేడ్చల్.

7. అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ అండ్ లాబ్ సర్వీసెస్, శేరిలింగంపల్లి.

8. మెడిక్స్ పాత్‌లాబ్స్ , న్యూ బోయినపల్లి.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: