జగన్ ఆశలు అడియాసలేనా ? రాజధాని తరలింపు ముగిసిన అధ్యయనమేనా ?

ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా రివర్స్ అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. జగన్ అమలు చేసిన పథకాలు తప్ప నిర్ణయాలన్నీ రివర్స్ అవుతున్నాయి. కోర్టుల్లో జగన్ ప్రభుత్వానికి చుక్కెెదురవుతోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తీసుకున్న అత్యంత వివాదాస్పదమైన నిర్ణయం ఏదైనా ఉందా అంటే అది రాజధాని తరలింపు. మూడు రాజధానుల పేరుతో జగన్  పరి పాలన వికేంద్రీకరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖ ను  పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేసేందుకు జగన్ సిద్ధపడ్డారు. దీనిపై అమరావతి పరిసర ప్రాంతాల్లో ప్రజలు రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైన జగన్ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గినట్టుగానే వ్యవహరించారు. 

 

 

ఈ మే నెలలోనే విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు జగన్ సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రతరం అవడంతో వచ్చే నెల 14 వరకు కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన కొనసాగే అవకాశం ఉండడం, ఆ తర్వాత నెల రోజులు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో రాజధాని తరలింపు పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి రాజధాని తరలింపుపై అందరిలోనూ ఆశీస్సులు ఉన్నాయి. ఎప్పుడైతే కరోనా వైరస్ కారణం గా చూపిస్తూ ఎన్నికలను వాయిదా వేయడంతో ఇప్పుడు రాజధాని తరలింపు పై కూడా అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక హైకోర్టు కర్నూలుకు, ప్రభుత్వ కార్యాలయాల తరలింపు తదితర పరిణామాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఆలోచనలు పడేస్తున్నాయి. 

 

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం పెరగడంతో ప్రభుత్వమే అధికారికంగా  లాక్ డౌన్ విధించిన పరిస్థితుల్లో ఇప్పుడు రాజధాని తరలింపు ప్రస్తావన తీసుకు వచ్చేందుకు కూడా వైసిపి వెనకడుగు వేస్తోంది. మే నెలలో ఎలాగైనా రాజధాని ని తరలించాలని పట్టుదలగా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ మేరకు ఉద్యోగ సంఘాలను ఒప్పించడం తో పాటు, ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నతాధికారులకు హామీలు ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ ఆశలు లేనట్టుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో కరోనా భయం వెంటాడుతోంది. ఎప్పటి వరకు 13 కేసులు నమోదయ్యాయి. ఇది ఎంతవరకు వెళ్తుందో చెప్పలేని పరిస్థితి. దీంతో అసలు రాజధాని అంశాన్ని కలిపేందుకు కు కూడా వైసిపి నాయకులు ఎవరు సిద్ధపడడం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: