హైదరాబాద్ లో జోరందుకున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఆందోళనలో వైద్యులు

Satvika

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ముదురుతున్న సమయం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా ను కట్టడి  చేసేందుకు జనతా కర్ఫ్యూ  ని విధించారు. కరోనా రూపాలు లేకుండా చేయాల నే ఆలోచన లో ప్రభుత్వం ఈ కర్ఫ్యూని  తీసుకొచ్చింది .  అంతే కాకుండా కరోనా ప్రభావం మరింత పెరుగుతుండటం తో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. 

 

 

 

జనతా కర్ఫ్యూ పేరు తో  ప్రజల ను ఇళ్లకే పరిమితం చేసింది. మార్చి 22 నుంచి  ప్రారంభమైన ఈ కర్ఫ్యులో భాగంగా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు.. ఎంత కరోనా గురించి బాధ్యతలు తీసుకున్న కూడా కరోనా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. అందుకే కరోనా వల్ల చాలామంది జీవినాదారం లేక అలమటిస్తున్నారు. అందుకే సినీ తారలు విరాళాలు  అందిస్తూ ప్రజలను  ఆదుకుంటూ వస్తున్నారు.. అయినా కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. 

 

 

 

తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా సోకింది. హైదరాబాదులో ఈ మూడు కేసులు నయోదయ్యాయి. రాష్ట్రంలో తొలిసారి ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కుత్బుల్లాపూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తితో పాటు... దోమలగూడలో భార్యాభర్తలైన ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ గా తేలింది.

 

 

కుత్బుల్లాపూర్ కు చెందిన వ్యక్తి ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చారు. కరోనా సోకిన వ్యక్తితో కలిసి ఉండటం వల్లే ఆయనకు పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. మరోవైపు నగరంలోని దోమలగూడలో 41 ఏళ్ల వైద్యుడి నుంచి ఆయన భార్యకు కూడా వైరస్ సోకింది. వీరిని ఐసొలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కొత్త కేసులతో తెలంగాణలో వైరస్ సోకినవారి సంఖ్య 44కు చేరుకుంది.మరి కొంతమందికి కరోనా లక్షణాలు ఉన్నాయని తెలుస్తుంది.

 

 

 

https://tinyurl.com/NIHWNgoogle

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: