
కరోనా బూచీ: జనతా కర్ఫ్యూను పాటిద్దాం... భారతదేశ ఐక్యత ప్రపంచానికి చాటుదాం...!
భారత్ యుద్ధానికి సిద్ధమైంది... ఇది ఎవరూ ఊహించనిది... యుద్ధం ఒక్కరి కోసం కాదు... భారత ప్రజలందరి కోసం... యుద్ధానికి ఆయుధాలు అవసరం లేదు... రక్తం చిందించాల్సిన అవసరం లేదు. ఇంటిపట్టున ఉంటే సరిపోతుంది యుద్ధాన్ని జయించినట్లే . కనిపించని శత్రువుతో కనీవినీ ఎరుగని యుద్ధం రేపు జరగబోయే యుద్ధం . కనిపించని ప్రాణాంతకమైన శత్రువుకి... కనిపించకుండా జయయించటమే ఈ యుద్ధం లక్ష్యం. అదే దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ యుద్ధం. భారత ప్రజానీకం మొత్తం రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించేందుకు సిద్ధమైపోయింది.
కళ్లకు కనిపించకుండా దాడి చేసి అందరిని కాటికీ పంపిస్తున్న మహమ్మారి శత్రువుని మౌనంగానే చంపేసే యుద్ధం. భారత ప్రజలందరూ కరోనా మహమ్మారిని చంపేందుకు సిద్ధమయ్యారు. రేపు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించి ప్రాణాంతకమైన మహమ్మారి కరోనా వైరస్ ను పారదోలేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. దీంతో రేపు దేశం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం గా మారనుంది. ఎవరు ఊహించని ఎవరికీ కనిపించని నిశ్శబ్దమైన యుద్ధం రేపు జరగనుంది భారతదేశంలో. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ ఎంతగానో మద్దతు లభిస్తోంది. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు... జనత కర్ఫ్యూ పాటించి కరోన ను దేశం నుంచి పారదోలుదాం అంటూ తన అభిమానులకు నిర్వహిస్తున్నారు.
రేపు ఒక్కరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా ఖర్చు పాటిస్తే ఈ యుద్ధం జయించినట్లే. ఎందుకంటే వైరస్ కేవలం 12 గంటలు మాత్రమే బ్రతికే ఉంటుంది కాబట్టి 14 గంటలపాటు కర్ఫ్యూ పాటించి కేవలం ఇంటికే పరిమితమైతే భారత దేశ వ్యాప్తంగా బయట ఉన్న వైరస్ మాత్రం నశించిపోతుంది. దీంతో కరోనా నుంచి భారత దేశం బయటపడుతుంది. అందుకే రేపు ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించండి... ఇది మన ఒక్కరి సమస్య కాదు జాతి సమస్య... ఇలాంటి సమయంలోనే భారత్ ఒక్క తాటిపై నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే జనతా కర్ఫ్యూ పాటిద్దాం భారత దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెబుదాం.