కరోనా కట్టడికి రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు !

NAGARJUNA NAKKA

దేశవ్యాప్తంగా కరోనా బీభత్సం కొనసాగుతుండటంతో భారత రైల్వే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లక్షలాది మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే... వైరస్‌ కట్టడికి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్టేషన్ లలో జనసమ్మర్థాన్ని తగ్గించడానికి ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్లను పెంచిన రైల్వే... పలు రైళ్లను కూడా రద్దు చేసింది. 

 

ప్రజా శ్రేయస్సు దృష్ట్యా రైల్వే ప్రయాణాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా.. పటిష్ట చర్యలు చేపట్టింది భారతీయ రైల్వే. అప్రాధాన్యమైన రూట్లలో, అధిక రద్దీ కలిగిన రూట్లలో ఇప్పటికే 155 రైళ్లను మార్చి 31 వరకు రద్దు చేసింది రైల్వేశాఖ. అయితే ఈ రైళ్లలో ఇప్పటికే టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్యాసెంజర్లకు.. ఫుల్‌ అమౌంట్‌ను వాపసు చేయనుంది. 

 

ఇక ప్రయాణాల్లో అందిస్తున్న రాయితీని రైల్వే శాఖ రద్దు చేసింది. అనవసర ప్రయాణాలను ఆపేందుకు.. వృద్ధులకు టిక్కెట్లలో ఇచ్చే రాయితీని తాత్కాలికంగా ఆపేసింది. రోగులకు మాత్రం మినహాయింపునిచ్చిన రైల్వే శాఖ.. విద్యార్థులకు, దివ్యాంగులకు ఇచ్చే రిజర్వేషన్‌ సెగ్మెంట్‌ను ఇవాళ్టి నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

 

రైల్వే స్టేషన్లలో అనవసరపు రద్దీని తగ్గించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ. అవసరమైన చోట ప్లాట్‌ఫామ్‌ టిక్కెట్లను యాభై రూపాయలకు పెంచింది. మరోవైపు, ప్రజలు అనవసరంగా ప్రయాణాలు చేయొద్దని సూచించింది. ఒకవేళ ప్రయాణాల్లో ఎవరైనా అధిక జ్వరంతో కనిపిస్తే.. వెంటనే రైల్వే వైద్యాధికారులకు సమాచారమివ్వాలని విజ్ఞప్తి చేసింది. 

 

రైల్వేస్టేషన్లలో ఎప్పటికప్పుడు కరోనాపై ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు.. కంటిన్యూస్‌గా అనౌన్స్‌మెంట్ చేయిస్తోంది. కరోనా కట్టడికి చేయాల్సినవేమిటో, చేయకూడనివేమిటో తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి దేశంలో కరోనా స్వైర వివాహం చేస్తుండటంతో ప్రజల్లో గుబులు రేగుతోంది. 

 

మొత్తానికి దేశంలో కరోనా స్వైర వివాహం చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన కలుగుతోంది. అందుకే కరోనా కట్టడికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. జన సమ్మర్థాన్ని తగ్గించే ప్రయత్నంలో రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్లాట్ ఫామ్ టిక్కెట్లను అమాంతం పెంచేసిన రైల్వేశాఖ.. తాజాగా పలు రైళ్లకు రెడ్ సిగ్నల్ వేసింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: