మన చట్టాలతో అతడు ఆటలాడుతున్నాడు..?

praveen

భారత ప్రజలందరికీ నిర్భయ చట్టం గుర్తుండే ఉంటుంది. దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం 23 ఏళ్ల నిర్భయ అనే యువతిపై అతి దారుణంగా అత్యాచారం చేసి ఆమె మర్మాంగాలలోకి పదునైన వస్తువులు జొపించడంతో తీవ్ర గాయాలపాలైన యువతి చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పాటుకు  గురైంది. అయితే ఈ ఘటన తర్వాత ఏకంగా ఇలా మహిళలపై అత్యాచారం హత్య చేసిన వారికి కఠిన శిక్షలు విధించాలి అంటూ నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో నిర్భయ నిందితులకు వెంటనే శిక్ష అమలు అవుతుందని అందరూ అనుకొన్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నాయి కానీ నిర్భయ నిందితులకు మాత్రం ఇప్పటికీ ఉరిశిక్ష అమలు కాలేదు. 

 

 ఎన్నో ఏళ్ల నుంచి నిర్భయ కేసులో ఉరిశిక్ష వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ప్రజల్లో రోజురోజుకు చట్టం పై నమ్మకం పోతుంది అనే చెప్పాలి. ఎన్నిసార్లు కోర్టు ఉరిశిక్షను అమలు చేసిన.. చట్టంలోని ఏదో ఒక లొసుగులను ఆసరాగా చేసుకుని ఉరిశిక్ష వాయిదా పడేలా చేస్తున్నారు. ఇలా ఒక్కో నిందితులు తమకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటూ ప్రస్తుతం చట్టాన్ని లోసుకుగులను అసరాగా  చేసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్భయ దోషులకు సంబంధించిన న్యాయవాది.. చట్టం యొక్క డొల్లతనాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారు అనే చెప్పాలి. దేశం మొత్తం నిర్భయ దోషులకు ఉరి శిక్ష పడాలని కోరుకుంటున్నప్పటికీ నిర్భయ దోషులకు మాత్రం ఎప్పటికీ ఉరి శిక్ష మాత్రం అమలు కావడం లేదు. 

 


 ఒక పిటిషన్ కొట్టివేయాగానే  మరొక పిటిషన్.. అది కొట్టు వేస్తే ఇంకొ  పిటిషన్.. అది కొట్టి  వేస్తే ఇంకొక పిటిషన్.. ఇలా వరుస పిటిషన్లు దాఖలు చేస్తూ ఎలాంటి శిక్ష పడకుండా కాలయాపన చేస్తూ వస్తూన్నారు. దీనిపై విశ్లేషకులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎప్పుడో  బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ఇప్పటికీ దోషులకు శిక్ష పడకుండా ఉపయోగించుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు. నిర్భయ దోశుల  విషయంలో చట్టాలకు లోబడి మాత్రమే తీర్పులను చెబుతానంటున్న జడ్జీల తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే రోజురోజుకు న్యాయస్థానాల పై ప్రజలకు నమ్మకం పోతుంది అంటున్నారు.

" height='150' width='250' src="https://www.youtube.com/embed/9uin3AJl6Jc" width="560" height="315" data-framedata-border="0" allowfullscreen="allowfullscreen">

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: