పనొడితో చెక్కెసిన భార్య.. భర్త ఎంచేసాడో చూడండి...
ఇదెక్కడి చోద్యం అండీ బాబు ... పని చేస్తానంటూ వచ్చి ఏకంగా ఓనర్ పెళ్ళాన్ని లేపుకెళ్ళడట.. మరో విషయమేంటంటే ఇంట్లోనే ఉంటూ ఇంటికి ఎసరు పెట్టిన ఓ పనొడి కథ మరి దారుణమని చెప్పాలి.. ఇంట్లోనే ఉంటూ యజమాని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని వారి కలియికకు అడ్డుగా ఉన్నాడని ఇద్దరు కలిసి గొంతు కోశారు..పనికి పెట్టుకునేటప్పుడు అతను ఎలాంటి వాడు అలాంటివి చూసుకోవాలని సూచిస్తున్నారు...
వివరాల్లోకి వెళితే...అక్రమ సంబంధం కారణంగా ఓ అమాయకుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది. కట్టుకున్న భార్యే ప్రియుడితో కలిసి అత్యంత దారుణంగా చంపేసింది. ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రమాదంగా చిత్రీకరించింది. అయితే పోలీసులు చురుగ్గా వ్యవహరించడంతో ఆమె బాగోతం బయటపడింది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామ శివారులో శుక్రవారం అర్ధరాత్రి దారుణహత్యకు గురైన తిరుపతి అనే వ్యక్తి కేసులో అనేక కోణాలు వెలుగు చూస్తున్నాయి. అతడిని భార్య మమత, ప్రియుడు సురేశ్‌తో కలిసి చంపేసినట్లు పోలీసులు తేల్చారు..
అయితే తిరుపతికి ఓ షాప్ ఉండేది .. అందులో పనిచేసే కుర్రాడు ఏదోక సాకుతో తిరుపతి భార్యను కలుస్తూ ఉండేవాడు..ఆ సమయంలో ఆమెకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు... అలా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు..ఇటీవల ఈ విషయాన్ని తెలుసుకున్న తిరుపతి పద్ధతి మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు. దీంతో భర్త తన సుఖానికి అడ్డొస్తున్నాడని భావించిన మమత అతడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది.
ఇదే విషయాన్ని ప్రియుడికి చెప్పి ప్లాన్ వేసింది. తిరుపతిని చంపేందుకు సురేశ్ నలుగురు వ్యక్తులకు రూ.40 వేల సుపారీ ఇచ్చాడు. ప్లాన్ ప్రకారం శుక్రవారం రాత్రి మమత కడుపునొప్పి వచ్చిందని భర్తను నమ్మించింది. భార్య నొప్పితో విలవిల్లాడటాన్ని భరించలేకపోయిన తిరుపతి ఆమెను తీసుకుని బస్వాపూర్‌కు బయలుదేరాడు. అప్పటికే ఊరి పొలిమేరల్లో కాపు కాసి ముఠా అదును చూసుకొని అతన్నే దారుణంగా చంపేశారు..
ఒక్కసారిగా అందరూ దాడికి దిగారు.. దీంతో తిరుపతి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అందరూ అక్కడి నుండి పరారయ్యారు.. ఈ మేరకు అనుమానం వచ్చిన బందువులు పోలీసులకు సామాచారాన్ని అందించారు.. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసుల కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.. ఇందులో భాగంగా తానే ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఒప్పుకుంది.. హత్య చేసిన హంతకులను వెతికే పనిలో పోలీసులు ఉన్నారని తెలుస్తుంది...