వైరల్ ఎహే: మనిషి మొహంతో పుట్టిన పంది పిల్ల..!

Suma Kallamadi

ప్రపంచంలో ఎన్నో నమ్మశక్యం కానీ వింతలు జరుగుతూ మానవాళిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇంటర్నెట్ దయవల్ల ప్రపంచ మూల లలో జరుగుతున్న ప్రతి ఒక్క వింత అందరికీ తెలుస్తుంది. గతంలో ఎన్నో ఉత్పరివర్తన జీవిలను మనం చూశాం. అంటే పిల్లి రెక్కలతో పుట్టడం, ఒంటి కన్నుతో పుట్టడం, తాబేలు మూడు తలలతో పుట్టడం, ఆవు ఆరు కాళ్లతో జన్మించడం, పంది రెండు తలలతో పుట్టడం, మేకకి సగం పంది, సగం మేక పుట్టడం లాంటివి చూసాం. వాతావరణంలోని కాలుష్యం వలన జంతువులు అయినా, మనుషులేనా ఇలా విచిత్రం గా పుడుతుంటారు. అయితే ఒక పంది మాత్రం అంతుచిక్కని రీతిలో జన్మించి అందరినీ షాక్ కి గురి చేస్తోంది. 

 

 

వివరాలిలా ఉన్నాయి... వెనిజులా దేశం లోని టోర్రెస్ మునిసిపాలిటీలోని క్యూబ్రాడా అరిబా లో ఒక పందికి అయిదారు పిల్లలు పుట్టాయి. అయితే అందులోని ఒక పంది పిల్ల మనిషి మొహం తో పుట్టింది. దాని కళ్ళు, నాలుక అచ్చు మనిషిని పోలి ఉన్నాయి. దాంతో పంది కాపరులు మొదటిగా నిర్ఘాంత పోయారు. తర్వాత ఈ చోద్యాన్ని అందరికీ చెప్పగా... మనిషి మొహంతో పుట్టిన పందిపిల్లని చూడడానికి తండోపతండాలుగా స్థానిక జనాలు తరలివచ్చారు. కొంతమంది ఈ నాచురల్ వింతని తమ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. 

 

 


అయితే ప్రస్తుతం మానవ మొహం తో పుట్టిన ఈ పంది పిల్ల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చాలామంది తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుండగా... మరికొంతమంది మాత్రం ఈ వింత జీవి ఎంతో కాలం బ్రతకదని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పొలాలలో ఎక్కువగా పురుగుల మందు వాడటం వలన ఈ పంది పిల్ల ఇలాగ పుట్టిందేమోనని కొంతమంది భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వైరల్ వీడియో అందర్నీ విస్తుపోయేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: