మోలీవుడ్లో మూడేళ్ల చిన్నారికి కరోనా వైరస్.. భయం గుప్పెట్లో కేరళ వాసులు..!

Suma Kallamadi

దేశంలో కరోనా కట్టలు తెంచుకుంటోంది. వైరస్ కేసులు నెమ్మది నెమ్మదిగా పెరగడం, పెను భయాందోళనలకు  ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, కేరళలో మరో కొత్త కేసు నమోదయ్యింది. మూడేళ్ల చిన్నారికి కోవిడ్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. అయితే ఆ బాలుడు ఇటలీ నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇక దీనితో దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 40కి చేరినట్లు సమాచారం. బాలుడి కుటుంబం మార్చి 7న ఇటలీ నుంచి ఇండియాకు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. 

 

మార్చి 7న ఉదయం 6.30 గంటలకు, కొచ్చి విమానాశ్రాయనికి చేరుకున్న సదరు బాలుడికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, పరీక్షల్లో బాలుడికి ఫీవర్ ఉన్నట్టు తేలడంతో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్ వార్డులో చేర్పించారు. ఇక ఆ బాలుడి తల్లిదండ్రులను కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి, రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్టు పేర్కొన్నారు. 

 

 

ఇక కేరళలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ నిర్ధారణ అయినట్టు ఆదివారం ప్రకటించిన సంగతి అందరికి విదితమే. ఈ ప్రాంతంలో కరోనా బాధితుల సంఖ్య 9 గా నమోదు కాగా, వైరస్ సోకిన ముగ్గురు బాధితులు కోలుకుని క్షేమంగా ఇళ్లకు వెళ్లినట్లు సమాచారం. మరోవైపు, కరోనా వైరస్ కేసులు దేశంలోనూ నమోదుకావడంతో మోడీ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవడంలో అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే పలువురు నేతలు పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

 

ఇటీవల కర్ణాటక ప్రభుత్వం స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇచ్చేసిన సంగతి విదితమే. అలాగే.. బెంగళూరు, కర్ణాటక, చెన్నై.. తదితర సౌత్ మరియు నార్త్ రూరల్ జిల్లాల్లోని పూర్వ-ప్రాథమిక, ఎల్‌కేజీ, యూకేజీ తరగతలను సోమవారం నుంచి నిలిపివేయాలని, తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ నిర్వహించకూడదని ఈ ఆదివారం రాత్రి సర్క్యులర్ జారీచేసింది. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకూ వర్తిస్తాయని, జాగ్రత్త వహించాలని ప్రాథమిక విద్యా శాఖ మంత్రి "ఎస్ సురేశ్ కుమార్" తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: