అక్కడ మగవారికంటే ఆడవారికే ప్రాధాన్యత ఎక్కువ.. తెలుసా ఎక్కడో?

Suma Kallamadi

అవును అక్కడ మగవారి కంటే, ఆడవాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత. మగాడికి మగడు పోటీ అనేది పాత కాలపు మాట. ఇపుడు అలాంటి మాటలకు కాలం చెల్లింది. ఇప్పుడు మహిళలు సైతం అన్ని రంగాల్లో మగవారికి మేటైన, దీటైన పోటీ ఇస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా అన్ని రంగాలలో మగవారితో సమానంగా వేతనాలు, జీతాలు ఇవ్వాలని మహిళలు సైతం ఉద్యమాలు చేయడం మనం చూస్తూ వున్నాం. 

 

 

ఇక తరతరాల నుండి, మగవారితో సమానంగా కష్టపడి పనిచేస్తున్నా వారికి తక్కువగా వేతనాలు ఇస్తున్న సంగతి మనకు విదితమే. అసలు వారి వాదన కూడా అదే. దానికోసం వారు రోజూ ఎక్కడో ఒక చోట.. ధర్నాలు, ఉద్యమాలు చేయడం మనకు తెలిసినదే. అసలు విషయం ఏమంటే, ఎన్ని రంగాలున్నప్పటికీ, కేవలం మోడలింగ్ లో మాత్రమే మగువలకన్నా మగవారికి తక్కువ పారితోషికాలు ఇస్తున్నారు.

 

మీరు ఆశ్చర్య పోతున్నా ఇది అక్షరాలా నిజమండి. అందుకనే తమకు సైతం సమానంగా పారితోషికాలు కావాలని మోడలింగ్ చేస్తున్న మగవారు ధర్నాలు చేయడం ఇక్కడ విశేషం. ఒకొక్క ప్రదర్శనకు మగువలకు ఇచ్చే పారితోషికంతో పోల్చుకొంటే, తమకు చాలా తక్కువగా చెల్లిస్తున్నారని సదరు మగవారు తీవ్ర మానసిక ఆందోళనలకు గురి అవుతున్నారు. ఇక అది గ్లామర్ పరిశ్రమ కావడంతో మగువలదే పైచేయిగా ఉంటున్నది. 

 

 

మన దేశంలో సైతం, మోడలింగ్ లో అదే పరిస్థితి నెలకొనడం గమనార్హం. మోడలింగ్ ప్రదర్శనలలో అత్యధికంగా స్త్రీలకే అవకాశాలు మెండుగా వున్నాయి. యెంత బడా ప్రదర్శనకైనా 20 నుండి 25 మంది మోడలింగ్ చేస్తున్న ఆడవారికి అవకాశం ఇస్తే, కేవలం 4 నుండి 6 మంది మగవారికి మించి అక్కడ  అవకాశం రావడం లేదు. ఇక, సహజంగా మగువలు ధరించే డిజైన్ వస్త్రాలకు ఉన్న డిమాండ్ మగవారు ధరించే డిజైన్ వస్త్రాలకు ఉండటం లేదు. అందుకనే డిజైనర్స్ ఎక్కువగా మగువలు దృష్టిలో ఉంచుకొనే డిజైన్ లను రూపొందిస్తున్నారు. అందువలనే అక్కడ మగువలదే పైచేయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: