కరోనా ఎఫెక్ట్ : బీరు తాగాలంటే భయం భయం...?
ఎండాకాలం వచ్చిందంటే చల్లటి బీర్లు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవైపు సూర్యుడు భగభగ మండుతూ ఉంటే చల్లని బీరు లోపలికి వెళుతుంటే అబ్బా ఎంత హాయిగా ఉంటుందో అనుకుంటూ ఉంటారు బీరు ప్రియులు. అందుకే వేసవి వచ్చిందంటే చాలు... ఎక్కువగా బీరు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు వేసవి కాలం రానే వచ్చేసింది. ఎండలు కూడా భగభగ మండటం మొదలవుతున్నాయి... కానీ బీర్ల అమ్మకాలు మాత్రం పెరగడం లేదు. ప్రజలు ఎవరు బీర్ల జోలికి వెళ్లడం లేదు. దీనంతటికీ కారణం.. ప్రస్తుతం అందరినీ ప్రాణభయంతో వణికిస్తున్న కరోనా వైరస్. కరోనా వైరస్ కారణంగా బీర్లు అమ్మకాలు భారీగా తగ్గిపోతున్నాయి. కరోనా వైరస్ కి బీర్ కి సంబంధం ఏమిటి అంటారా. అది తెలియాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే.
కరోనా వైరస్ ఎక్కువగా చల్లటి ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చల్లటి ఉపరితలంపై కరోనా వైరస్ ఎంతసేపయినా బతికి ఉండే అవకాశం ఉందని... చల్లటి గాజు బాటిల్స్ స్టీల్ రాడ్ పై ఈ వైరస్ చాలా సేపు బతికే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మామూలుగానే కరోనా పేరెత్తితే భయపడిపోతున్నారు ప్రస్తుతం నిపుణులు ఇలా సూచించడం తో కూల్ డ్రింక్ సీసాలు బీరు సీసాలు ముట్టుకోవాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా వేసవి వస్తున్నప్పటికీ చిల్డ్ బీర్ తాగేందుకు కూడా వెనకాడుతున్నారు.
ఎందుకైనా మంచిది అంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజానికి 26 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి ఉన్నపుడు కరోనా వైరస్ చనిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత సేపు ఎండలో నిలబడడం లేదా వేడి నీళ్లు తాగడం ద్వారా కూడా కరోనా వైరస్ దరిచేరకుండా చూసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ ప్రభావం ప్రస్తుతం చల్లటి బీరు అమ్మకాలపై కూడా పడినట్లు తెలుస్తోంది.