తొందరలో కీలక  ప్రకటన  ? అయోమయంలో జనసైనికులు

Vijaya
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. రాజకీయంగా ఫెయిలయిన పవన్ మెల్లిగా పార్టీ బాధ్యతలను ఇంకోరికి అప్పగించేస్తున్నట్లే అనుమానంగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో విఫలమైన తర్వాత పవన్ చూపు మళ్ళీ సినిమాలపై పడింది. అందుకనే వరుసగా ఇపుడు మూడు సినిమాలు చేస్తున్నాడట. సినిమా రంగంలో కూడా పెద్దగా హిట్స్ లేకపోయినా బండి సాఫీగా సాగిపోతోంది. ఎన్ని ఫ్లాపులున్నా పవన్ కు డిమాండ్ అయితే తగ్గలేదు.

ఈ కారణంతోనే హిట్లకన్నా ఫెయిల్యూర్లు ఎక్కువున్నా అగ్రహీరోగా చెలామణి అయిపోతున్నాడు పవన్ . అదే సమయంలో రాజకీయాల్లో దూకి ఘోరంగా విఫలమయ్యాడు.  చంద్రబాబునాయుడు జేబులోమనిషిగా ఎంతకాలమని జగన్మోహన్ రెడ్డిని తిడుతూ కాలం గడపగలడు ? ఒకవైపేమో ప్యాకేజీ స్టార్ అనే ముద్ర పడిపోయింది. అదే సమయంలో జగన్ అసలు జనసేనను ఓ పార్టీగాను పవన్ ను ఓ రాజకీయ నేతగాను లెక్కేయటమే లేదు.

సో అన్నీ కోణాల్లో భేరీజు వేసుకున్న తర్వాత మెల్లిగా రాజకీయాల నుండి సినిమాల్లో బిజీ అయిపోవాలని డిసైడ్ అయిపోయాడు. అందుకనే సోమవారం నుండి మూడు రోజుల పాటు జరగనున్న కీలకమైన పార్టీ సంస్ధాగత సమావేశాలను కూడా ఎగొట్టేశాడు. తనకు బదులుగా నాదెండ్ల మనోహర్ ను పంపాడు. పార్టీ పెట్టినప్పటి నుండి ఇంతటి కీలకమైన సమావేశాలకు పవన్ గైర్హాజరవ్వటం ఇదే మొదటిసారి. కాబట్టి ఇక నుండి పార్టీ బాధ్యతలను మనోహర్ పైనే మోపేసి తాను ఎంచక్కా సినిమా షూటింగ్ ల్లో బిజీ అయిపోవాలని డిసైడ్ అయ్యాడు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తొందరలోనే నాయకత్వ బాధ్యతల మార్పు  విషయంలో నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నాయట. ఏదేమైనా పవన్ కు రాజకీయాలకన్నా సినిమాలే బాగా అచ్చొచ్చినట్లుంది. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యంపార్టీ పెట్టినపుడు కూడా యువరాజ్యం బాధ్యతలు తీసుకున్నాడు. అప్పుడు కూడా ఫెయిలే. ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేసి గందరగోళం సృష్టించటం ఒక్కటే పవన్ కు తెలిసింది. అదే పద్దతి ఇప్పుడు కూడా కంటిన్యు చేస్తున్నాడు. ఏ విషయంలో కూడా స్ధిరభిప్రాయం లేని పవన్ రాజకీయాలకన్నా సినిమాలకే సరిగా సూట్ అవుతాడేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: