హైదరాబాద్: రాష్ర్ట రోడ్డు రవాణా శాఖాధికారులు ప్రమాదాలు జరిగితే కాని కళ్లు తెరిచేట్లు లేరు. రాష్ట్రానికి చెందిన కాళేశ్వరీ ట్రావెల్స్ బస్ మహారాష్ర్టలోని ఉస్మానాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మొదలుకుని వరుసగా గత నాలుగైదు రోజులుగా రాష్ర్టంలో ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదంలో జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదంలో అనేక మంది దుర్మరణం చెందారు. ఎంతో మంది ప్రాణాలు పోతే కానీ రాష్ర్ట రోడ్డు రవాణా శాఖాధికారులు నిద్ర నుంచి మేలుకొనలేదు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రవాణాధికారులు ప్రయివేట్ బస్ సర్వీసులపై ద్రుష్టిని పెట్టారు. ట్రావెల్స్ ఆఫీసులపై దాడులు చేస్తున్నారు. అధికారుల దాడులతో అనేక ట్రావెల్స్ కార్యాలయాలపై దాడుల చేయడంతో నిబంధనలకు విరుద్దంగా బస్ లు నడుస్తున్నట్లు తేలింది. హైదరాబాద్, మెదక్, గుంటూరు, అనంతపురం, వైజాగ్, కరీంనగర్, గుంటూరు , క్రిష్ణ తదితర ప్రాంతాలలో అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరద్దంగా నడుస్తున్న 50 బస్ లను అధికారులు సీజ్ చేశారు. అధికారులు సీజ్ చేసిన బస్‌లలో అధికంగా కాళేశ్వరీ ట్రావెల్స్‌వే అధికంగా ఉండటం గమనార్హం. రవాణా శాఖాధికారులు నిర్వహించిన దాడుల్లో నిబంధనలకు విరుద్దంగా పలు ట్రావెల్స్ నిర్వహాకులు బస్ సర్వీసులను నడిపిస్తున్నట్లు తేలింది. అయితే, వరుస ప్రమాదాల నేపథ్యంలోనే అధికారులు దాడులు చేయగా, అనేక ట్రావెల్స్ సంస్థల యాజమానులు నిబంధనలకు విరుద్దంగా బస్ లను నడిపిస్తున్నారనీ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే...అధికారులు దాడులు జరిపి బస్ లను సీజ్ చేసిన సంస్థలు నిన్న మొన్న పుట్టుకు వచ్చినవి కావు. ఆ బస్సులన్నీ ఆయా రూట్లలో ఎన్నో సంవత్సరాల తరబడిగా నడుస్తున్నాయి. నిబంధనల మేరకు రాష్ర్టంలోని ఎన్ని ట్రావెల్స్ సంస్థలు ఏ ఏ రూట్లలో బస్‌లను నడిపిస్తున్నాయి, నిబంధనలను అతిక్రమించి ఏ ఏ సంస్థలు ఏ ఏ రూట్లలో ఎన్నెన్ని బస్ సర్వీసులను నడిపిస్తున్నయన్న సంగతి రవాణా శాఖాధికారులకు తెలువదా? అధికారులకు తెలువకుండానే బస్‌లు నడుస్తున్నాయా? అంటే నమ్మడానికి ఎవరూ చెవుల్లో పువ్వులు పెట్టుకోలేదు. వాస్తవానికి చెప్పాలంటే నిబంధనలకు వ్యతిరేకంగా అనేక ట్రావెల్స్ సంస్థలు పలు రూట్లలో సర్వీసులను నడిపిస్తున్నారు. ట్రావెల్స్ సంస్థల యాజమానులకు రాజకీయంగా పలుకుబడి ఉండటం, వారి నుంచి రవాణాధికారులు నెల నెలా ముడుపులు పుచ్చుకోవడంతోనూ చూసీచూడనట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అధికారులు ఆలస్యంగానైనా మేల్కొనడం హర్షించదగ్గ విషయం.
మరింత సమాచారం తెలుసుకోండి: