బీజేపీ లీడర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన జగన్..!!

KSK

ఇటీవల వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టిన తర్వాత కొంచెం బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు చాలా వార్తలు వచ్చాయి. మోడీ మరియు అమిత్ షా ని కలిసిన తర్వాత జగన్ ఎన్డీయేతో కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నట్లు రావడం జరిగాయి. ఇదే సమయంలో వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది మంత్రులు కూడా మీడియా ముందు రాష్ట్రాభివృద్ధికి బీజేపీతో కలిసి పనిచేసే అవసరం వస్తే జగన్ కి ఇష్టమైతే పని చేసే అవకాశం కూడా ఉన్నట్లు కామెంట్ చేయడం జరిగింది. ఇటువంటి సమయంలో బీజేపీ లీడర్ కి జగన్ నామినేటెడ్ పదవిని బంపర్ ఆఫర్ గా ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. విషయంలోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిజెపి పార్టీ మహిళా నేత నామినేటెడ్ పదవి ని పెట్టింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ఆలయాలు అయినటువంటి బెజవాడ దుర్గమ్మ ఆలయం మరియు సింహాచలం వరలక్ష్మి నరసింహ స్వామి ఆలయం, పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు లను ఏర్పాటు చేసింది. అయితే సింహాచలం అప్పన్న ఆలయం పాలకమండలి సభ్యురాలిగా బీజేపీ మహిళా నేత సంచయిత గజపతిరాజును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో విమానయాన శాఖ కేంద్ర మంత్రి గా పనిచేసిన అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనందగజపతిరాజు కూతురు అయినా సంచయిత గజపతిరాజు 2018లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  స్వఛ్చ భారత్, జిల్లాలో సురక్షిత నీరు అందించేందుకు పార్టీ కృషి చేసిన కార్యక్రమాలలో ఈమె ఎంతగానో శ్రమించారు.

 

దీంతో చాలా సేవాకార్యక్రమాలలో సంచయిత గజపతిరాజు పాల్గొనడం గమనించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈమెకు ప్రభుత్వం తరఫున నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. అయితే సింహాచలం అప్పన్న ఆలయం పాలకమండలిలో మొత్తం 16 మంది సభ్యులను ప్రకటించిన ప్రభుత్వం అందులో సంచయిత గజపతిరాజుకి కూడా అవకాశం కల్పించడం విశేషం. అయితే మరోపక్క జగన్ బీజేపీకి మరింత దగ్గరగా వెళ్ళాడు అని బయట ఉండే సపోర్ట్ చేయటం స్టార్ట్ చేశారని కొంతమంది ఈ విషయం పై కామెంట్ చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: