హైదరాబాద్ పోలీసుల రికార్డు.. ఓ ప్రాణం కాపాడేందుకు ఎంత సాహసం చేసారంటే..?
ఈ మధ్యకాలంలో పోలీసులు ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఎన్నో రిస్కులు సైతం చేస్తున్నారు.ఓ చిన్నారి ప్రాణం కాపాడడానికి మంగళూరు టు బెంగళూరు అంబులెన్స్ వచ్చేందుకు పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేశారు.తాజాగా హైదరాబాద్ పోలీసులు కూడా ఓ మనిషి ప్రాణం కాపాడడానికి సంచలన నిర్ణయం తీసుకొని రికార్డు సృష్టించారు అని చెప్పాలి. పోలీసులు ఉన్నది ప్రజలకు రక్షణ కల్పించడానికి ప్రజల ప్రాణాలను కాపాడడానికి అని మరోసారి నిరూపించారు. గుండె తరలింపు కోసం... ట్రాఫిక్ ఫుల్లుగా రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలో ఎలాంటి అంతరాయం లేకుండా సరైన సమయంలో తరలించారు. వైహాత్మకం గా వ్యవహరించి... ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. హైదరాబాద్ పోలీసులు సమయస్ఫూర్తి పై అందరి నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే... రాంపల్లి నాగరంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న 20ఏళ్ల విశాల్ ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో అతని తలకు గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు విశాల్. దీంతో వెంటనే తల్లిదండ్రులతో మాట్లాడి అవయవదానానికి అంగీకరించేలా చేశారు జీవన్దాన్ నిర్వాహకులు. అవయవదానం చేస్తుండడంతో విశాల్ గుండెను సేకరించి ప్రత్యేక బాక్స్ లో పెట్టి అంబులెన్స్లో తీసుకెళ్లేందుకు నిర్ణయించారు... దీని కోసం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు హైదరాబాద్ నగర పోలీసులు.
యశోద ఆస్పత్రి నుంచి గుండెని అంబులెన్స్లో తీసుకుని... జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. రెండు ఆస్పత్రిలో మధ్య దూరం 13 కిలోమీటర్ల ఉండగా...ఎలాంటి అంతరాయం లేకుండా కేవలం 11 గంటల వ్యవధిలోనే గుండె తరలించారు. ట్రాఫిక్ పోలీసులు అందరి సహకారంతో ఈ ప్రక్రియ ఎలాంటి అవాంతరం లేకుండా జరిగిపోయింది. యశోద ఆస్పత్రి నుంచి రాత్రి 8:50 గంటలకు బయలుదేరి... 11 నిమిషాల్లో అపోలో కు చేరుకుంది. దీంతో సకాలంలో ఓ వ్యక్తికి గుండె మార్పు చేసి ప్రాణాలను కాపాడారు పోలీసులు. హైదరాబాద్ పోలీసులు వ్యవహరించిన తీరు పై ప్రశంసల వర్షం కురుస్తోంది